ఆత్మ చైతన్యమే. అదే వస్తువు. ఇదంతా దాని ఆభాస. ఆభాస అని దీన్నే అర్ధం చేసుకోలేని వాడు క్రొత్తగా మరొక విశ్వాన్ని చూపినా అర్థం చేసుకోగలడా. అలా చేసుకొనే వాడైతే ఇదే ఒక స్వప్నంగా చూచేవాడు. అలా చూస్తే దాన్ని ఈ స్వప్నంలో మరొక స్వప్నమని చెప్పి రెండింటినీ త్రోసిపుచ్చి రెండింటి స్థానంలో అధిష్ఠానమైన ఆత్మనే దర్శించే వాడు.
అలా దర్శించిన వారు నారదాది మహర్షులు. వారూ చూచారు
గదా భగవానుడి విశ్వరూప మింతకు పూర్వం కౌరవ సభలో. అప్పుడు
వారెవరూ అర్జునుడిలాగా కోరుకో లేదు చూడాలని కోరకున్నా
స్వయంగానే చూపారు పరమాత్మ. అది చూచి వారేమీ గాబరా పడలే
దర్జునుడిలాగా. భయపడలేదు. భయపడి వెంటనే దాన్ని ఉపసంహరించమని
మొర పెట్టలేదు. కారణం ఈ చూచే విశ్వరూపం నిజమైతే గదా ఆయన
ఇప్పుడు కొత్తగా చూపుతున్నది నిజం కావటాని కని వారికి బాగా తెలుసు.
తెలిసిన వాడెప్పుడూ చూడాలని ఉబలాట పడడు. చూపితే గాబరా పడడు.
అధిష్ఠాన జ్ఞానమున్న వాడికంతా ఆభాసే. ఇక గాబరా ఏముంది. అది
లేనివాడికే ఈ వ్యవహారమంతా. అయినా తనకు జ్ఞానం లేదనిపించుకోట
మిష్టం లేదు వాడికి. లేకున్నా ఉన్నట్టు ప్రగల్భాలు పలుకుతుంటాడు.
అలాంటి ప్రగల్భాలే ఇప్పుడర్జునుడు పలికే ప్రగల్భాలు. ఇది ఇక్కడే
గాదు. గీతోపదేశమంతా విన్న తరువాత కూడా ఇలాగే పలికాడు ప్రగల్భాలు.
నష్టో మోహః స్మృతిర్లబ్ధా నా అజ్ఞానమంతా తొలగిపోయింది. పరమాత్మ
Page 376