#


Index

విశ్వరూప సందర్శన యోగము

అంటే. ఈ చుట్టూ ఉన్న జగత్తే కాదు. దీన్ని చూచే జీవుడూ వీడెక్కడో ఉన్నాడని ఊహించే ఈశ్వరుడూ కూడా. మూడూ అనాత్మే. ఇదంతా నా స్వరూపంగా దర్శించటమే అది. అలాటి అఖండ జ్ఞాన ముందా ఇప్పుడర్జునుడికి. అలాటి జ్ఞానమే నిజంగా ఉన్నవాడైతే విశ్వరూపం క్రొత్తగా చూడాలని ఉబలాట పడతాడా. అంతా ఆత్మ స్వరూపంగా చూచే వాడికెక్కడ ఉంది విశ్వం. విశ్వమే లేకుంటే అది చూడాలనే చాపల్యమెక్కడిది. అయినా చూడాలని ముచ్చట పడ్డాడంటే ఆ జ్ఞానమేమి ఒంటబట్టినట్టు. అంతే కాదు. విశ్వరూపం చూడాలను కొన్నవాడు చూపితే ధైర్యంగా చూడవచ్చు గదా. మధ్యలో ఎందు క ధైర్యపడి ఉపసంహరించ మని మళ్లీ ప్రాధేయ పడ్డాడు. ఇందులోనే తెలిసిపోలేదా అతని అధ్యాత్మ జ్ఞానమెంతటిదో. పైగా నాకు మోహమంతా వదిలిపోయిందని భీకరాలు పలకట మెంత బాగుంది. మోహమే లేనివాడైతే విశ్వమెలా కనిపించిందతనికి. భయమెందుకు వేసింది. అలా కనిపించిందంటే అనాత్మ భావమింకా ఉందర్జునుడికి. భయ సంభ్రమాలున్నాయంటే అది ఇంకా గాఢంగానే ఉందని ఒప్పుకోవాలి.

  మరి ఈ విశ్వరూప మనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది గదా సర్వులకూ. అది వాస్తవమేనని చూస్తున్నారు లోకులందరూ. ఇక కొత్తగా ఒక విశ్వరూపాన్ని చూచేదేమిటి. చూచినా అదీ మాయామయమే. ఇదీ మాయామయమే వాస్తవానికి. రెండూ లేవు. ఉన్న దంతటా వ్యాపించిన

Page 375

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు