#


Index



విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత


భౌతికమూ స్వప్నమే. అభౌతికమని చూపిన విశ్వరూపమూ స్వప్నమే. స్వప్నాన్ని ఎవరు చూస్తుంటే వాడికే అది దృగ్గోచరం. మిగతా వాళ్ల కక్కడే ఉన్నా అది గోచరం కాదు. అందుకే అర్జునుడే చూచాడు విశ్వరూపం. దుర్యోధనాదులు అక్కడే ఉన్నావారికి కనపడ లేదు. ఇదే వ్యాసమహర్షి హృదయం. ఆయన వివక్షితం. అది ఈ విశ్వరూపాధ్యాయ మంతా ఆ మూలాగ్రమూ అంతర్వాహికంగా ప్రసరిస్తూనే ఉంటుంది. అది ఎలా ప్రసరిస్తున్నదో దాన్ని మనమెలా ఆకళించుకోవాలో ప్రతి శ్లోకమూ ఇందులో మనకు మౌన భాషలో సాక్ష్యమిస్తూనే ఉంది. అది ఎలాగో తరచి చూద్దామిప్పుడు.

మదను గ్రహా య పరమం గుహ్య మధ్యాత్మ సంజ్ఞితం
యత్త్వ యోక్తం వచస్తేన - మోహోయం విగతో మనః -1


  అర్జునుడు మాటాడుతున్నాడు వినండి. బావగారూ నామీది అనుగ్రహంతో మీరు పరమం గుహ్య మధ్యాత్మ సంజ్ఞితం అధ్యాత్మ జ్ఞానమనే పేరుతో చాలా గొప్ప రహస్యం బోధించారు. యత్త్వయోక్తం. అలాంటి రహస్యమేది బోధించారో మీరు తేన మోహోయం విగతో మమ. దానితో నాకు పట్టిన అజ్ఞానమనే మాలిన్యమంతా క్షాళితమయి పోయింది సుమా అని డచ్చాలు కొడతాడు. అధ్యాత్మ జ్ఞానమంతా ఒంట బట్టిందట తనకు. ఏమి టధ్యాత్మ జ్ఞానమంటే. ఆత్మే గాక అనాత్మగా కనిపించే సమస్తమూ కూడా ఆత్మగానే దర్శించే జ్ఞానమేదో అదీ అధ్యాత్మ జ్ఞానం. ఏమిటనాత్మ

Page 374

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు