బదులూ ఉన్నది మన అఖండ చైతన్యమే. అది మన స్వరూపమే. ఇలాటి స్వరూప జ్ఞానం మన కలవడితే అంతా మన స్వరూపమే. విభువైనా మనమే. విభూతి అయినా మనమే. పోతే ఇలాటి దివ్య దృష్టి మీకు స్వభావ సిద్ధమైనదే అనాది కాల ప్రవృత్తమైన అవిద్యావశాత్తూ మీరు మరచి పోయారు సుమా. అలా మరచిపోవటం మూలాన్నే అది కృష్ణుడనే పేరుతో ఒకడు చూపుతున్నట్టు వాడొక దివ్యమైన దృష్టినిస్తే అర్జునుడనే పేరుతో ఇంకొకడది చూస్తున్నట్టు చూడలేక వాడు భయపడి ఉపసంహరించమని వేడుకొన్నట్టు అలాగేనని చెప్పి ఆయన ఉపసంహరించినట్టు ఇదంతా ఒక నాటకం. నాటకమంతా బూటకమే.
ఇది నాటకం బూటకమని అక్కడక్కడ మనకు గుర్తు చేస్తూనే ఉన్నాడు మహర్షి. నీవీ చర్మ చక్షుస్సులతో చూడలేవు దివ్య దృష్టి నిస్తాను చూడమని చెప్పటం నాటకం గాక మరేమిటి. చర్మ చక్షువులతో చూస్తూనే ఉన్నాము గదా ఈ విశ్వాన్ని. ఇది ఆయన రూపం కాకపోతే గదా. దివ్యదృష్టి ఇవ్వటమేమిటి. ఇచ్చింది జ్ఞానమెలా అవుతుంది. ఆగంతుకం కాదు జ్ఞానమనేది. అది సహజం. ఆగంతుకం కాదు గనుకనే ఒకరిచ్చినా పని చేయదు. మధ్యలోనే భయపడతాము చూడలేక. అలాటి దృష్టే సహజంగాక పోతే దానితో చూచే ప్రపంచం సహజమా. అదీ అసత్యమే. అందుకే కృష్ణుడది ప్రదర్శిస్తే కనిపించింది. ఉపసంహరిస్తే పోయింది. వచ్చే పోయేది సత్యమెలా అవుతుంది. అది కృష్ణుడు తనకు భిన్నంగా ఎక్కడో చూపినా
Page 372