#


Index



విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత


పరమాత్మ వేరే లేనట్టే విశ్వం కూడా మనకు వేరే లేదు. ఒక వేళ ఉన్నట్టు కనిపించినా అది మన మాయాశక్తి ప్రభావం వల్ల మనకు కనిపించే మన విభూతే. అహంతా Sub రూపంగా ఉన్ననేనే ఇదంతా Obj రూపంగా నాకు నేను చూపుతూ నాకు నేనే దర్శిస్తున్నాను. అందుకే విభూతిని వర్ణించేటప్పుడు ప్రతి పదార్థంలోనూ అహ మహ మనే మాట దొర్లిస్తూ వచ్చాడు మహర్షి ప్రతి విభూతి శకలమూ అహమనే చైతన్యానికి వేరుగా లేదని మనకు తెలపటానికే. అలాంటప్పుడెక్కడో లేదు విశ్వరూప ప్రదర్శన. నిత్యమూ మనం చూస్తున్న ఈ విశ్వమే ఈ రూపమే. పరిమితమైన జీవదృష్టితో చూస్తే ఇది నాకు భిన్నంగా కనిపిస్తున్న భౌతికమైన విశ్వమని - ఇంతకన్నా అభౌతికమైన దొకటుందని భ్రమపడుతుంటాము. అప్పుడు మన దృష్టి సహజంగా దివ్యమైనా అది గుర్తించని నేరానికి మర్త్యమైన దృష్టిగా మారి శరీరం మేరకే ఆగిపోయి దానికి వేరుగా ఒక విశ్వాన్ని భౌతికంగా మరొక విశ్వాన్ని అభౌతికంగా ఊహించుకొంటూ పోతుంది. అది మర్త్యం కాదు దివ్యమైనదే మనకు సహజంగా ఉందనే వాస్తవాన్ని గుర్తించామంటే విశ్వేశ్వేరుడే నిజం విశ్వమంతా దాని విభూతే అది విశ్వేశ్వరుడికి విలక్షణంగా ఎక్కడా లేదంతా హుళక్కేనని నిర్ధారణ అవుతుంది. అప్పుడది మనదే కాబట్టి ఒకరివ్వ నక్కర లేదు. మనం పుచ్చుకోనక్కర లేదు. అసలు విశ్వేశ్వరుడూ లేడు. విశ్వరూప ప్రదర్శనా లేదు. సందర్శనమూ లేదు. దాన్ని సందర్శించే అర్జునుడూ లేడు. అన్నింటి

Page 371

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు