ప్రపంచమేదైనా ఒకటుందా దాన్ని పట్టుకొని అక్కడే ఉండి పోతే బాగుండునని ఆలోచిస్తుంటాము. ఉంది నిజమే. కాని ఇదెంతో అదంతే. ఇదంతా ఎవరి వల్ల ఏర్పడిందో ఏది దీని కధిష్ఠానమో దాన్ని అర్థం చేసుకోకుండా దీనితో మాత్రమే తల పట్లు పడితే ప్రయోజనం లేదు. దానికి వేరుగా చూస్తే ఇదీ అబద్ధమే. అదీ అబద్ధమే. దానితో సంబంధించినంత వరకే ఇది సత్యం. లేదా ఈ విశ్వమూ అసత్యమే. ఆ విశ్వమూ అసత్యమే. ఆ మాటకు వస్తే పరమాత్మే సత్యం. ఆయన విభూతి అంతా అసత్యమే. విభువు మారడు. అది నిరాకారం నిర్గుణం. వ్యాపకం. విభూతి సాకారం సగుణం వ్యాప్యం. కనుక దీనికే రాకపోకలు. నిలకడ లేని దిది.
మరి దివ్య దృష్టి మాటేమిటి. అది పరమాత్మ మనకెప్పుడో ఇచ్చాడు. ఇవ్వటం కాదది మన దగ్గరే ఉన్నది. సహజంగానే ఉన్నది. అదే మన జ్ఞానం. జ్ఞానం వరకూ అది నిరాకారం. నిర్గుణం. వ్యాపకమైనదే. కనుకనే పరమాత్మ నది ఎప్పుడూ దర్శించగలదు. దర్శించగలదంటే ఆ పరమాత్మ ఎక్కడో ఉన్నాడని కాదు. ఆ దృష్టి తనకున్నదని గుర్తిస్తే ఈ జీవాత్మే పరమాత్మ. అప్పుడిక ఆ పరమాత్మ ఒక విశ్వాన్ని కొత్తగా చూపనక్కర లేదు. మనం చూడనక్కర లేదు. మనమే పరమాత్మ అన్నప్పుడొకరు చూపేదేమిటి. మరొకడు చూచేదేమిటి. అసలు చూపటానికీ చూడటానికీ విశ్వమనే దెక్కడ ఉంది. నిరుపాధికంగా మన చైతన్యమే వ్యాపించినప్పుడిక
Page 370