#


Index




విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత

చూడకుండా దానిమీద ఆరోపితమైన దాన్నే దర్శిస్తున్నాడు. అలా చూస్తే అది దివ్యం కాదు. మర్త్యమైన దృష్టి. అధిష్ఠానమే వాస్తవం. దానితో కలిపి పట్టుకొంటే భయం లేదు గాని దాన్ని దూరం చేసుకొని దీన్ని మాత్రమే చూడబోతే భయమే. రజ్జువును చూడకుండా సర్పాన్ని చూడబోతే భయమే. రజ్జువును చూడకుండా సర్పాన్ని చూస్తే భయపడక ఏమవుతాడు మానవుడు. అందుకే చూడలేక భయపడ్డా డర్జునుడు. ఈశ్వరుడు తన కదే పనిగా దివ్య దృష్టి నిచ్చినా అది వాడు కొనే సామర్ధ్య ముండాలి. అది కూడా లేదర్జునుడికి.

  ఇంతదూరం వచ్చిన తరువాత మనమొక ఆధ్యాత్మకమైన గొప్ప రహస్యాన్ని గ్రహించవలసి ఉంది. అసలా రహస్యాన్ని మన కందించటానికే వ్యాసభగవానుడు ఇంత పెద్ద కల్పన చేశాడా అని తోస్తుంది. అదేమిటంటే అసలు కృష్ణుడు లేడు. అర్జునుడు లేడు. యుద్ధభూమి లేదు. అర్జునుడు నాకు నీ విశ్వ రూపం చూపమని అడగనూ లేదు. కృష్ణుడతనికది చూపలేదు. దివ్య దృష్టినివ్వనూ లేదు. ఇచ్చి అది తన దేహంలో ఏకస్థం చేసి చూపటమూ లేదు. ఇదంతా వ్యాసమహర్షి చేసిన బ్రహ్మాండమైన కల్పన. ఒక పెద్ద శాస్త్ర సంకేతం. దీని ద్వారా ఆయన లోకాని కంద జేసే ఆద్వైత సందేశ మొకటున్నది. అదేమంటే యుద్ధభూమి ఈ సంసారమే. రధాలు మనశరీరాలే. యుద్ధం నిరంతమూ దీనితో మనం సాగించే జీవిత వ్యవహారమే. దీనితో విసుగు చెంది ఇంతకన్నా గొప్ప ప్రపంచం కొత్త

Page 369

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు