చూపుతానంటే అది నీలమేఘ శ్యామలంగా లోకులకు కనిపించే దేహం కాదు. సచ్చిద్రూపంగా ఆకాశంలాగా అనంతంగా వ్యాపించిన పరమాత్మ తత్త్వం. వాసుదేవ అనటంలోనే ధ్వనిస్తున్నదా అర్థం. వాసుదేవ స్సర్వమితి అని భగవద్గీతే చాటుతున్నదా అనంతమైన తత్త్వాన్ని. అంచేత ఇక్కడ మమ దేహే అని చెప్పినా అది దేహం గాని దేహం. చిదాకాశమే దేహమని అర్థం చేసుకోవాలి. అప్పుడది ఏకం. అంటే చరా చర జగత్తు నంతా నిరాకారంగా వ్యాపించిన ఒకే ఒక పదార్ధం. నిరాకారం గనుక శరీరం కాదది అశరీరం. అలాటి ఏకంలో స్థ. అంతర్గతమయి కనిపిస్తున్నదీ విశ్వమంతా. అలా ఏకస్థం చేసి ప్రదర్శిస్తున్నాడు. ఎవరు. కృష్ణుడా. కృష్ణుడు కాదు. కృష్ణ పరమాత్మ. అంటే పరమాత్మ రూపంగా ఉన్న కృష్ణుడు. అది ఇప్పుడు నీలమేఘ శ్యామలమై కనిపించే విగ్రహం కాదు. ఇది వ్యక్తమైన రూపమైతే అది అవ్యక్తమైన తత్త్వం. అదే తన మాయాశక్తి వల్ల వ్యక్తమయి కృష్ణ విగ్రహంగా కనిపిస్తూ వచ్చిందింత వరకూ. ఇప్పుడది తన అవ్యక్తమైన రూపంగా మారింది. కనుక ఎవరికీ కనిపించదిప్పుడు. దుర్యోధనాది వీరులకే గాదు. అర్జునుడికి కూడా. అతడు కూడా చూడలేక పోతున్నాడా అవ్యక్త తత్త్వాన్ని. కేవలమది చూపే విశ్వరూపాన్ని మాత్రమే చూస్తున్నాడు. కనుకనే భయపడుతున్నాడు. ఎందుకని. దివ్య దృష్టి నిచ్చాడు గదా పరమాత్మ. ఇచ్చాడు. కాని ఇచ్చినా అది పని చేయదు. ఏమి కారణం. విభువును చూడకుండా తద్విభూతిని మాత్రమే చూస్తున్నాడు. అంటే అధిష్ఠానాన్ని
Page 368