పాండవ బాలాలెన్నో సమావేశమయి ఉన్నాయి. ఎందరో ఉన్నారు మహావీరులు. అర్జునుడు చూస్తున్నప్పుడు వారు మాత్రం చూడటం లేదా. వారెవ్వరూ చూడకుండా ఒక్క అర్జునుడే చూచాడా. అతని కొక్కడికే చూపాడా కృష్ణుడు. అది సంభవమా. అని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. వీటికి సమాధాన మేమంటే కృష్ణుడు కృష్ణుడుగా చూపలేదు. అర్జును డర్జునుడుగా చూడలేదు విశ్వరూపం. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య స చరాచర మని ఒక అద్భుతమైన మాట ఉన్నదక్కడ. అర్జునా నీకు నేనొక్క చోటనే చూపుతానీ విశ్వాన్నంతా అంటాడు. అంతేగాదు. ఆ ఒక్కచోటూ ఏదో గాదు. మమ దేహే అని కూడా అంటాడు. నా శరీరంలోనే చూపుతాను చూడమంటాడు. అంటే అప్పటికేమని భావం. కృష్ణ విగ్రహమే విశ్వరూపాన్ని చూపే ప్రదేశం. అక్కడే ఆ ఒక్క ప్రదేశంలోనే విశ్వమంతా ఆయన చూపుతుంటే అర్జునుడు చూస్తున్నాడనా. అర్థం లేని మాట. ఎందుకంటే వృష్టీనాం వాసుదేవోహం. యాదవులలో నేను వాసుదేవుణ్ణి - పాండవా నాం ధనంజయః పాండవులలో నీవు అర్జునుడివి అని ఇంతకు ముందే పేర్కొన్నాడు. విభూతి యోగంలో. భగవద్విభూతి ఎంతో దూరం వ్యాపించి ఉంటే అందులో ఏ మూలనో ఏ ద్వారకలోనూ నివసిస్తూ అర్జున రథ సారథ్యం వహించి యుద్ధభూమిలో ప్రవేశించిన ఒక విగ్రహమా కృష్ణుడు. అలాటి విగ్రహంలో విశ్వమంతా ఎలా చూపగలడు. అలాగే ఎక్కడో పడి ఉన్న అర్జునుడెలా చూడగలడు. అంచేత కృష్ణుడు నా దేహంలో
Page 367