అయితే మరి ఎప్పుడైతే తట్టుకొని నిలబడగలం. విశ్వమెంత అనంతంగా విచిత్రంగా వ్యాపించి ఉందో అంత అనంతంగా అఖండంగా విస్తరించి ఉండాలి మన జ్ఞానం. అప్పుడీ మూడు మూరల జానెడు శరీరం మేరకే ఉండటానికి లేదు మనం. ఆకాశంలాగా సర్వత్రా విస్తరించి నిరుపాధికంగా అశరీరంగా ఉండిపోతాము. అదే బ్రహ్మాకార దృష్టి. అప్పుడిక విభువనే వాడు వేరేలేడు. అతడు చూపే విశ్వమూ వేరే ఎక్కడా లేదు. మన స్వరూపమే విభువు. మన విభూతే ఈ చరాచర విశ్వమంతా. అంతవరకూ ఒకడు చూపాలి మనం చూడాలి విశ్వరూపాన్ని. చూపేవాడు మన కన్నా బ్రహ్మాండమైన చూపున్న ఏ కృష్ణ పరమాత్మో అయి ఉండాలి. చూచే మన మల్ప శక్తి సంపన్నులమైన ఏ అర్జునుడిలాంటి వాళ్ళమో కావాలి. అలా ఒకరు మనకే విశ్వాన్ని చూపినా సుఖం లేదు. ఎంచేత. ఆమాటకు వస్తే అసలీ విశ్వమే లేదు. కనిపిస్తున్నా ఇది వస్తు సిద్ధంగా లేదు. ఆభాస. అంటే అర్థం. విభువు తాలూకు నీడ. ఈశ్వర చైతన్యం కంటే వేరుగా విశ్వమనేది తనపాటికి తానుండ లేదు. సర్వం వస్తు సదా త్మనా సత్యం స్వతస్తు అనృత మేవ. ప్రతిపదార్ధమూ సద్రూపంగానే వాస్తవంగాని దానికి వేరుగా చూస్తే అబద్దమేనన్నారు భాష్యకారులు. అలాంటప్పుడీ విశ్వరూపమేమిటి. దాన్ని కృష్ణ పరమాత్మ అదే పనిగా అర్జునుడికి చూపాడని చెప్పటమేమిటి. అంతా వట్టిది.
అలాంటప్పుడది ఎలా చూపాడు కృష్ణుడు. ఎలా చూచాడర్జునుడు. అర్జునుడొక్కడే చూడటమేమిటి. అది కురుక్షేత్రం. యుద్ధభూమి. కౌరవ
Page 366