#


Index



విశ్వరూప సందర్శన యోగము

అంతేగాక నేనిక చూడలేను మహానుభావా నీ రూపముప సంహరించమని ప్రాధేయపడతాడు. ఏమిటిది. దివ్య దృష్టి భగవానుడిచ్చినా చూడలేక పోవటమేమిటి. అందులోనే ఉన్నది మర్మం. బ్రహ్మాకార వృత్తి ఒకరిచ్చేది గాదు. మనం పుచ్చుకొనేది గాదు. అలా పుచ్చుకొన్నా మనకు శాశ్వతంగా నిలిచేది గాదు. ఎరవు సొమ్ము మన సొంత మవుతుందా. అందుకే మనం మన స్వప్రయత్నంతోనే సాధించా లేదైనా. ఇటు ఐహికమైనా అటు ఆముష్మికమైనా మన సాధన మీదనే ఆధారపడి ఉంది. అలా సాధిస్తేనే మనకు భయం లేదు. కారణం. మన మాపాటికి ఈశ్వర స్వరూపులమయి ఆ దివ్యమైన దృష్టితో చూస్తామాయన విభూతిని. కాదు కాదు. మన విభూతినే. మన విశ్వరూపాన్నే. లేకుంటే అర్జునుడి లాగానే భయపడి చస్తాము. మన అలవాటులో లేనిదేది అదాటుగా చూచినా మనకు భయమే. ఉన్నట్టుండి మన మిప్పుడొక దక్షిణాఫ్రికా అరణ్యంలో పోయి పడ్డామనుకోండి. సహారా ఎడారిలో తిరుగుతున్నా మనుకోండి. లేదా ఒక ఎవరెస్టు శిఖర మెక్కి కూచున్నా మనుకోండి. అదీ గాక ఒక చంద్రమండలంలోనే ప్రవేశించి అక్కడ ఒంటరిగా తిరుగుతున్నామే అనుకోండి. ఏమైనా మనశ్శాంతి ఉంటుందా. గాబరా పడతాం. గందరగోళ పడతాం. అసలు గుండె గుభేలుమని చచ్చిపోతాం. అలాంటప్పుడు అండపిండ బ్రహ్మాండాత్మకమైన సృష్టి అంతా ఒక్కసారి మన దృష్టికి గోచరిస్తే ఏమవుతుంది. భరించలేము. అసలు బతకలేము. కారణం. మనకున్న చూపు చాలా చిన్నది. మనం చూడవలసిన ప్రపంచ మనంతమైనది. అపరిచితమైనది.

Page 365

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు