#


Index



విశ్వరూప సందర్శన యోగము

అప్పుడు ప్రపంచాకార వృత్తు లెగిరిపోయి వీడి కీశ్వరాకార వృత్తి ఏర్పడుతుంది. అఖండమైన ఈ వృత్తికే దివ్య దృష్టి అని నామకరణం చే చేశాడు మహర్షి. అది శ్రవణ మనన ధ్యానాదుల వల్ల గాని లభ్యం గాదు. మానవ ప్రయత్న లభ్యమైన దీన్నే దైవదత్తంగా వ్యవహరిస్తున్నాము మనం. దైవికమైన స్థాయి కెదిగినప్పుడిది మన కలవడుతున్న దృష్టి గనుక దైవదత్తమని పేర్కొన్నారంత మాత్రమే.

  మరి అలాంటప్పు డర్జునుడికి స్వప్రయత్నం లేకుండానే ఎలా ప్రాప్తించిందా దృష్టి. అది వ్యాస మహర్షి కల్పించిన కధా సంకేతం. సంకేత మెప్పుడూ సత్యం కాదు. తన పాటికి తాను సత్యం కాకపోయినా సత్యాన్ని చూపుతుందది. ఇక్కడ దివ్య దృష్టి నీశ్వరుడతని కిచ్చాడనేది సంకేతం. అది మనకు చెప్పే సత్యం వేరే ఉన్నది. అదీ మనం పట్టుకోవలసింది. అదేమిటంటే అర్జునుడిలాగా ఏ మానవుడెలాటి ప్రయత్నమూ చేయకుండా ఈశ్వరాకారమైన చిత్తవృత్తి నభ్యసించకుండా ఈశ్వర విభూతిని దర్శించాలని ఉబలాట పడ్డా దానివల్ల ప్రయోజనం లేదు. విభువును గుర్తించకుండా విభూతిని మాత్రమే చూడాలను కొంటే అది నెరవేరేది గాదు. నెరవేరక పోగా ఎక్కడ లేని భయాందోళన లేర్పడి హడలిపోతారని మానవులందరినీ దీనిమూలంగా హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. దీనికి నిదర్శనమెంతో దూరం పోనక్కర లేదు. కృష్ణుడు దివ్య దృష్టి సరఫరా చేసినా ఆ అద్దాలు తనకుచితంగా లభించినా సమగ్రంగా చూడలేక భయపడిపోయా డర్జునుడు.

Page 364

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు