నీకు. కాని నీవది చూడాలంటే ఈ చర్మ చక్షుస్సులతో చూడలేవు సుమా. దివ్యమైన నా రూపం దివ్యమైన దృష్టి పెట్టుకొనే చూడాలి. అది నీకు సహజంగా లేదు కాబట్టి నేను నీకు సప్లయి చేసి తరువాత చూపుతానంటాడు. అలాగే అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ పిమ్మట ప్రదర్శిస్తాడతనికి తన విశ్వరూపం. ఇది మనకు కూడా ఒక హెచ్చరికే దైవదత్తమైన అఖండ జ్ఞానమున్న వాడు గాని అఖండమైన దైవ సృష్టిని దర్శించలేడని.
కాని ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఈశ్వరుడిస్తేనే అర్జునుడు చూచాడంటున్నారు. అర్జునుడికే నేమి. అప్పుడర్జునుడి కిచ్చిన వాడు మనకూ ఇవ్వవవచ్చు గదా ఆ దివ్య దృష్టి. ఆయన చేతిలోనే ఉంది గదా ఇవ్వటం. పైగా సర్వులూ ఆయనకు సమానమే గదా. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః అని ఆయనగారే గదా చాటి చెప్పారు లోకానికి. అలాంటప్పుడు మూకుమ్మడిగా అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఎందుకు ప్రసాదించడా దివ్య దృష్టి మానవులందరికీ. ఇది కొంచెం లోతుకు దిగి తెలుసుకోవలసిన రహస్యం. అసలు విషయమే మంటే ఈశ్వరు డనే వాడెక్కడో లేడు. ఎవడో గాదు. ఈ జీవుడే. వీడే అవిద్యావశాత్తూ ఒక దేహం మేరకే ఆగిపోయి ఇదేనా స్వరూపమని అభిమానిస్తే జీవుడు. ఈ జీవుడే శుద్ధమైన సర్వవ్యాపకమైన చైతన్యమే నేనని గుర్తించి అంతవరకూ తన్నంటి పట్టుకొన్న ఈ దేహాభిమానాన్ని వదిలేస్తే వీడే ఈశ్వరుడు.
Page 363