#


Index



విశ్వరూప సందర్శన యోగము

అప్పుడు నా జ్ఞానానికి తప్పకుండా సాక్షాత్కరిస్తుంది. ఎక్కడికో వెళ్లి చూడనక్కర లేదు. ఎప్పుడో చూడక్కర లేదు. పరిపూర్ణమైన నా జ్ఞానానికి పరిపూర్ణంగానే ఈ విశ్వరూపం దర్శనమిస్తుంది.

  అయితే వచ్చిన ఇబ్బంది ఏమంటే అలాటి మహాభాగ్యానికి నోచుకోలేదీ మానవుడు. వీడు శుద్ధ చైతన్య స్వరూపుడయి కూడా కర్మ చాలక శరీరాదులతో చేయి కలిపి చిదాభాసుడయి కూచున్నాడు. శరీర మాత్ర పరిచ్ఛిన్నమైన దృష్టితో చూడబోయే సరికి పరిపూర్ణమైన విశ్వరూపమెలా కనిపిస్తుంది వీడికి. వీడి దృష్టికి తగినట్టే అంతకంతకు తగ్గిపోయి ఏ కొంచెమో దర్శనమిస్తున్నది. అదేగా మనందరికీ ఇప్పుడున్న దృష్టి. పామరులకే గాదు. మనలో శాస్త్రజ్ఞులూ కళాకారులూ ఆచారపరులూ ఉపాసకులూ భక్తులూ అనిపించుకొన్న పెద్దలకు కూడా లేదు విశ్వతో ముఖమైన దృష్టి. అంచేతనే అలాటి సర్వతో ముఖమైన దృష్టి లేకపోయినా సర్వతో వ్యాప్తమైన విశ్వరూపమెలా ఉంటుందో ఎవరో చూపితే చూడాలని చాపల్యం. ఎవరు చూపాలా విశ్వరూపం. తనకెప్పుడు చేతగాలేదో చేతనైన వాడే చూపాలది. ఎవడు వాడు. ఇంకెవడు. విశ్వేశ్వరుడు. అంటే విశ్వవ్యాపకమైన చైతన్యమేదో అది. అదే ఈశ్వరుడు. వాడు దేశకాలాలన్నీ వ్యాపించి తన వ్యాప్తిలో దేశకాలాల నన్నింటినీ చూడగలిగిన వాడు. అలా చూడగలిగినవాడే మనకు చూపగలడు. ఇప్పుడు సూర్యుడు మనకు వెలుగు నిస్తున్నాడంటే ఎలా ఇస్తున్నాడంటారు. తాను స్వయంగా

Page 361

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు