ఆగిపోతుందో ననే భయంతో తిరిగి భూమి మీదికి రావలసిందే గదా. అలా కాక ఇంకా ఇంకా చూద్దామని చాపల్యంతో ప్రయాణాలు సాగించినా ఎంతకాలం సాగిస్తావు. ఎంతని చూస్తావు. అలోపలే నీ నా ఆయుఃప్రమాణం తీరిపోదా. కన్ను మూయమా. ఆ తరువాత ఇక చూచేదేమిటి చేసేదేమిటి. అంతా మటుమాయం.
దీనికంతటికీ కారణ మొకటున్నది. అది మనం మరచిపోతున్నాం.
ఏదో గాదది. మనమీ శరీరం మేరకే పరిమితమయి ఉన్నామను కోటం.
అందుకే మనకు పరిమితంగానే కనిపిస్తున్నదీ విశ్వం. పరిమితమైన ఈ
శరీరాన్ని దాటి ఉన్నాననే జ్ఞానం మన కలవడితే గాని మన దృష్టి పరిపూర్ణం
కాదు. అప్పుడు మనమెక్క డుంటాము. శరీరపు టెల్లలు దాటితే చాలు.
జ్ఞేయమైన నామరూపాలతో సంపర్కం తెగిపోయి నిరాకారంగా
దర్శనమిస్తుంది మన జ్ఞానం. నిరాకారమని దాని సహజమైన
స్వరూపమెప్పుడు బయటపడ్డదో అప్పుడది ఆకాశంలాగా సర్వత్రా
వ్యాపిస్తుంది. జడమైన ఆకాశమూ నిరాకారమే. మన చైతన్యమూ
నిరాకారమే. రెండు నిరాకారాలెప్పుడూ ఉండవు. రెండూ కలిసి
నిజానికొక్కటే. అదే చిదాకాశం. చిత్తు నా స్వరూపమైతే ఆకాశం నా స్థితిగా
అనుభవానికి వస్తుంది. అప్పుడిక దేశకాల వస్తువులనే అవధు
లంతరిస్తాయి. కాబట్టి అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో అన్ని వస్తువుల్లో నేనే
ఉండిపోతాను. దేశకాల వస్తురూపంగా వ్యాపించి ఉన్న ఈ విశ్వమంతా
Page 360