#


Index



విశ్వరూప సందర్శన యోగము

ద్వాపర యుగంలో క్రొత్తగా చూపాలా కృష్ణుడు. దాన్ని క్రొత్తగా చూడాలా అర్జునుడు. కృష్ణుడు చూపటం దేనికి. అర్జునుడు చూడటం దేనికి. పరమాత్మ అప్పుడే గాక ఇప్పుడూ ఉన్నాడు గదా. ఆయన మనకెప్పుడూ చూపుతూనే ఉన్నాడుగా ఈ విశ్వమనే తన రూపాన్ని. దీన్ని మనబోటి అర్జునుల మిప్పుడూ చూస్తూనే ఉన్నాము గదా. అయినా ఆయన విశ్వరూపం చూడాలని ఎందుకా అర్జునుడికీ మనకూ ఈ కుతూహలం. ఎందుకంటే మనం చూస్తున్న ఈ విశ్వరూపం సమగ్రం కాదు. అసమగ్రమిది. మన దృష్టికీ భూమండలమే అంతు పటట్టం లేదు. మనమీ భూమిలో ఎక్కడో ఏమూలనో పడి ఉన్నాము. మన దృష్టికెంత కనపడితే అంతే ఈ భూమి. దీనిమీద ఉన్న కొండలూ నదులూ సముద్రాలూ అరణ్యాలూ పట్టణాలూ ఎక్కడెక్కడ ఏవున్నాయో మనమిప్పు డిక్కడే కూచుని చూడ గలుగుతున్నామా. లేదు. ఆయా ప్రదేశాలకే వెళ్లి చూచామనుకొండి. అప్పుడు మాత్రం మన కంటికెంత మేర కనిపిస్తుందో అంతే గదా మనం చూడగలం. మిగతా అఖండమైన భూమండలం దర్శించగలమా. ఇదే మనం పూర్తిగా చూడలేనప్పు డింత కన్నా పెద్దవీ చిన్నవీ అసంఖ్యాకంగా ఉన్నాయీ అనంత విశ్వంలో గోళాలు. అవన్నీ చూచే అవకాశమే లేదు. ఆశే లేదు మనకు. చచ్చి సున్నమై ఒకవేళ ఈ శాస్త్రజ్ఞులే రాకెట్టో ఏదో తయారు చేసుకొని అంత దూరం వెళ్లి చూచినా ఏ ఒక్క గ్రహమో అదీ ఏ కొంచెమో ఏ కొద్దిసేపో చూచి మరలా ప్రాణ వాయువు సరఫరా ఎక్కడ

Page 359

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు