#


Index



విశ్వరూప సందర్శన యోగము

నేను తాదాత్మ్యం Identity చెందగూడదు. అయినా చెందే ఉన్నాము. దీనికే దేహాత్మాభిమాన మని పేరు. దేహాది సంఘాతం వాస్తవంలో నేను కాకపోయినా నేనేనని దానితో మమేక మయిపోవటం. అంచేతనే అనంతం కాక దేహం మేరకే పరిమితమై సొంతమయి కూచున్నాను. మరి నా స్వరూపమెప్పుడు దేహం మేరకే పరిచ్చిన్నమయి పోయిందో అప్పుడిక నేను చూచే ఈ విశ్వమెలా కనిపిస్తుంది. పరిచ్ఛిన్న Limitted మైన నా దృష్టి కది కూడా పరిచ్ఛిన్నంగానే కదా కనిపించవలసింది. ప్రమాణాన్ని బట్టి ప్రమేయం. మనమెలా చూస్తే అలాగే గోచరిస్తుందేదైనా. రజ్జు దృష్టితో చూస్తే రజ్జువుగాని సర్ప దృష్టితో చూస్తే రజ్జువెలా కనిపిస్తుంది. సర్పం గానే భాసిస్తుంది. ఇంతెందుకు. చంద్ర సూర్యాది గోళాలెంతో విశాలమయి కూడా భూమండలం మీది నుంచి చూచే మన దృష్టి కవి ఎంత విశాలమో అంత వైశాల్యం కనిపిస్తున్నదా మనకిప్పుడు. ఏదో ఒక చిన్న వెండి కంచంలాగా దర్శనమిస్తున్నాయి. అలాగే నామరూపాత్మకంగా పరిచ్ఛిన్నమైన మన జ్ఞానానికి పరిచ్ఛిన్నంగానే గోచరిస్తున్నదీ విశ్వమిప్పుడు.

  కనుకనే అసలైన విశ్వరూప మేదో అది ఎంత ఉన్నదో దాని నంతటినీ చూడాలని అభిలాష మానవుడికి. అర్జునుడు విశ్వరూపం నాకు చూపమని అడిగాడంటే ఈ దృష్టితోనే అడిగాడు. కృష్ణుడు చూపుతానని చెప్పి అతనికి తన విశ్వరూపాన్ని చూపాడన్నా ఇదే అంతరార్థం. అలా కాకుంటే విశ్వరూపం క్రొత్తగా చూపేదేమిటి. ఇతడు చూచేదేమిటి. అప్పుడెప్పుడో

Page 358

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు