#


Index



విశ్వరూప సందర్శన యోగము

విశ్వమంతా రూపమేనని Formation. కాగా రూపం లేనివాడు విశ్వేశ్వరుడు. అంటే విశ్వాన్ని దాటి పోయినవాడు. పోతే రూపం లేనివాడు రూపాన్ని చూడటం జరుగుతున్నది. ఎప్పుడు. ఎప్పుడని ప్రశ్న లేదు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ జరుగుతున్న పనే అది. ఎవరా రూపం లేనివాడు. నీవూ నేనూ. అంటే నీనా జ్ఞానం. జ్ఞానానికి రూపం లేదు. అదే అసలైన విశ్వేశ్వరుడు. అది నిత్యమూ చూస్తున్నది. దేన్ని. విశ్వాన్ని. దానికున్నది రూపం. ఏమిటది. ఒకటి గాదు. రెండు గావు. తొంభయి తొమ్మిది. దానికి గోచరించేవన్నీ రూపాలే. మనోవాక్కాయాలూ వాటి వ్యాపారాలూ. బాహ్యమైన చరాచర పదార్థాలూ అటు పిండాండమూ ఇటు బ్రహ్మాండమూ అన్నీ రూపాలే. రూపం లేని జ్ఞానమే ఈ రూపాలన్నింటినీ గమనిస్తున్నదా లేదా ఇప్పుడు. అలా చూడాలంటే ఒక కండిషనుంది. నీవా రూప ప్రపంచాని కంతటికీ వేరుగా ఉండాలి. అది కూడా నీ జ్ఞానానికి వేరుగా ఉండాలి. జ్ఞానం జ్ఞేయమైనా కనలేడు దాన్ని. జ్ఞేయం జ్ఞానమైనా కనిపించదు దానికి.

  కాని ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమంటే మన జ్ఞానమిప్పుడు పరిశుద్ధమైన జ్ఞానం కాదు. అంతో ఇంతో జ్ఞేయ ప్రపంచంతో కలిసి కలుషితమైన జ్ఞానమే మనకున్న జ్ఞానం. అది ఎలాగని అడుగుతారేమో. శరీరమూ ఇంద్రియాలూ మనసూ ప్రాణమూ ఇలాటి ఉపాధి వర్గమంతా నాకు కనిపించే జ్ఞేయమని చూస్తున్నామా దాన్ని - గమనించే నేనే నా జ్ఞానమేనని చూస్తున్నామా చెప్పండి. కేవలం నా జ్ఞానమే నని చూస్తే వాటితో

Page 357

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు