#


Index



విశ్వరూప సందర్శన యోగము

గదా. దీన్నే చూడవచ్చు గదా అని నీ ప్రశ్న. చూడవచ్చు. కాని ఇది అదే దాని విభూతే. దానికంటే వేరుగా లేదు. వేరుగా ఉందను కోవటం నీ భ్రమ. చూడాలను కోటమంత కన్నా భ్రమ. అసలు నీవు దాన్ని సిద్ధాంతంగా గ్రహిస్తున్నప్పుడూ ఉందది. గ్రహించక ముందూ ఉంది. సిద్ధాంతంగా గ్రహించి దాన్ని దృష్టాంతం చేసుకోవాలని వెళ్లి చూచినప్పుడూ ఉంది. ఆది మధ్యాంతాలన్నీ అదే. అది మరలా ఏదో గాదు నీ జ్ఞానమే. అందుకే తత్త్వమసి - అయమాత్మా బ్రహ్మ- ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేవి ఆత్మ స్వరూపంగా ఎప్పుడూ ఉన్న తత్త్వాన్నే చెబుతున్నాయి. ఇంతకు ముందు నీవది కాదు. ఇప్పుడు నీవది గ్రహిస్తే అవుతావని చెప్పటం లేదు. భూత భవిష్యత్తులలో లేదది. ఎప్పుడూ వర్తమానమే నీ స్వరూపం. పైగా సర్వం ఖల్విదం బ్రహ్మ - ఇదం సర్వం యదయ మాత్మా అని కూడా చాటుతున్నది. ఈ కనిపించే ప్రపంచమను. దీన్ని కంటున్న జీవుడను. ఇవి ఎప్పుడూ నీ స్వరూపమే నీ జ్ఞానమే నని ఘోషిస్తున్నది. అలాంటప్పుడు ఆత్మకు భిన్నంగా అనాత్మ రూపమని భావించే ఈ విశ్వమెక్కడ ఉన్నది. దాని రూపాన్ని నీవు చూడాలనే చాపల్యాని కర్ధమేమున్నది.

  అయితే మరి కృష్ణ పరమాత్మ చూపాడు అర్జునుడు చూచాడు విశ్వరూపాన్ని - అని వ్యాస మహర్షి వ్రాశాడు గదండీ. ఒక అధ్యాయమంతా వర్ణించాడు. ఎందుకు వర్ణించినట్టని పెద్ద ప్రశ్న వస్తున్నదిప్పుడు. దీన్ని బాగా లోతుకు దిగి అర్ధం చేసుకోవాలి మనం. విశ్వరూపమంటే అర్ధం

Page 356

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు