సాధన చేసినట్టే స్వానుభవానికి తెచ్చుకొన్నట్టే. బ్రహ్మానుభవానికి వేరే సాధన అంటూ మిగతా విద్యలలో మాదిరి లేశమాత్రం కూడా లేదు. తతిమా రంగాలలో సిద్ధాంతం వింటే సరిపోదు. వెళ్లి చూడాలి తెలుసుకోవాలా వస్తు వెక్కడుందో ఎలా ఉందో. సాధించకుండా సిద్ధించదది. ఇక్కడ అలాటి పరిశ్రమ చేయనక్కర లేదు. అసలు దాని కవకాశమూ లేదు. సిద్ధాంతం శ్రవణం చేస్తున్నామంటేనే తదాకార వృత్తి ఏర్పడుతుంది మనసులో. ఆ దృష్టి కనురూపంగానే దృశ్య ప్రపంచమంతా బ్రహ్మాకారంగా మారి కనిపిస్తుంది. ఆ దృష్టే సాధన. ఆ కనిపించటమే అనుభవమిక్కడ. సిద్ధాంతమైన తరువాత సాధన అంటూ లేదు.
ఎందుకని. బ్రహ్మమే గదా ఇక్కడ వస్తువు. అంటే వాస్తవంగా ఉన్న పదార్ధం. అది అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా సకల ప్రదేశాలలోనూ ఉంది. భూతం భవిష్యత్తు వర్తమానా లన కుండా సర్వ కాలాల్లోనూ ఉంది. అలాగే స్థావరం జంగమ మనకుండా సకల పదార్ధాలలోనూ ఉంది. దేశకాల వస్తువులన్నీ వ్యాపించి ఉంది. అసలు దేశకాల వస్తువులనేవి కూడా అదే. అలాంటప్పుడది ఇక సిద్ధాంత మేమిటి. దృష్టాంత మేమిటి. దాని దృష్టి ఏర్పడ్డ తరువాత దాన్ని ఎక్కడికి వెళ్లి చూస్తావు. అది నీకు దృశ్యంగా Obj ఎక్కడైనా ఉంటే గదా. ఆత్మ స్వరూపమే Subనీకది. ఆత్మ అన్నప్పుడు నీ జ్ఞానమే అది. అలాంటప్పుడు జ్ఞేయంగా ఎక్కడ ఉందని వెళ్లి చూడాలి నీవు. అయితే ఈ ప్రపంచమిలా విస్తరించి నాకు కనిపిస్తున్నది
Page 355