#


Index



విశ్వరూప సందర్శన యోగము

కొంటుంది. అసలది ఎక్కడెక్కడ నివసిస్తుంటుంది. ఏది క్రూరమైనది. ఏది సాధు జంతువని ఇలాటి వివరాలన్నీ ప్రత్యక్షంగా చూస్తేగదా. విన్నాడంత మాత్రమే. ఆ విన్న విషయం మనసులో ఉన్నదే గాని తన కండ్లతో ఎప్పుడూ కన్నది గాదు. విన్నదంతా జ్ఞానమే. అనుభవంగాదు. అనుభవంతోనే ఆఖరవుతుంది ఏ జ్ఞానమైనా. దానికే విజ్ఞానమని గుహ్యమని పేరు పెట్టింది భగవద్గీత. లౌకికమైన విజ్ఞానం కాదిది. గుహ్యమూ కాదు. పరమమైన గుహ్యం.

  అది ఎలాగంటే మిగతా అన్ని విద్యలలో సిద్ధాంతమూ వాస్తవమే. దాని అనుభవమూ వాస్తవమే. తరగతిలో విన్న వృక్షాలూ జంతువుల తాలూకు వివరాలన్నీ ఎలా వాస్తవమో వాటిని మనసులో పెట్టుకొని బయటికి వెళ్లి చూచిన వృక్ష జంతుజాలం కూడా అంత వాస్తవమే. సిద్ధాంత దృష్టాంతాలు రెండూ వాస్తవమే. ఏదీ అవాస్తవం కాదు. అబద్ధం కాదు. కాని ఇక్కడ అధ్యాత్మ క్షేత్రంలో కేవలం దానికి ప్రతిలోమం. ఏ పదార్ధాన్ని గూర్చి వర్ణిస్తున్నామో అది మాత్రమే సత్య మిక్కడ. ఇక మిగతా దాని వ్యవహారమంతా ఆభాసే. దాని పాటికది సత్యం కాదు. సత్యమే అలా విస్తరించి కనిపిస్తున్నది. కనుకనే దానిని విభూతి అని పేర్కొన్నారు. విభువును విడిచి విభూతి ఎక్కడా లేదు. అది కూడా విభువు తాలూకు అవస్థాంతరమే A phase రూపాంతరమే A form. కాబట్టి విభువనే దాని స్వరూపమేదో గురువు గారు వర్ణించి శిష్యుడు దాని కనుగుణంగా భావన చేస్తే చాలు.

Page 354

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు