విభూతి యోగము
భగవద్గీత
బాబా పరమాత్మ నిత్యమూ చూపుతున్న ఈ మహిమ కేమి చెబుతావు జవాబు. అంతే కాదు. ఈ ఛోటా బాబాలు తీసే వస్తువు లేవి గాని వీరు క్రొత్తగా సృష్టించి నీకివ్వటం లేదు. అంతకుముందే పరమాత్మ సృష్టిలో ఉన్నవాటినే నీకూ నాకూ చూపుతున్నారు. అది కూడా ఎక్కడినుంచో తెచ్చి ఇవ్వటం లేదు. ప్రక్కనో వెనకనో చాటుమాటుగా ఉన్నదాన్ని హస్తలాఘవంతో బయటికి లాగి ప్రదర్శిస్తున్నారు. అంతా దొంగనాటకం. పొట్ట కూటికి కొందరైతే పేరు ప్రతిష్ఠలకు కొందరు పడే పాట్లివన్నీ. నన్నడిగితే ఒక విధంగా వీరు మనకు తోడ్పడుతున్నారు. ఈ క్షుద్ర శక్తులను బట్టి పరిపూర్ణమైన భగవన్మాయా శక్తి ఎలాంటిదో ఎంత దివ్యమైనదో మన మర్ధం చేసుకొని వీటి మీద విరక్తి చెంది దాని మీద రక్తి పొందటానికి భగ్యంతరంగా తోడు పడతాయివి.
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరః - ఇంకా ఒక్క విషయ మేమంటే ఇంతవరకూ నేను నీకేకరువు పెడుతూ వచ్చిందే నా విభూతి విస్తారమని ఇంత మాత్రమేనని మళ్లీ నీవు భ్రాంతి పడవద్దంటున్నాడు భగవానుడు. అయితే చెప్పిందేమి టంటారు. ఏషతూ ద్దేశతః ప్రోక్తః కేవలం కొన్ని మాత్రమే మచ్చుకు నీకుదాహరిస్తూ వచ్చాను. అదే విభూతి సర్వస్వ మిక మిగులేమీ లేదను కోగూడదట.
అయితే కొన్ని మాత్రమే ఎందుకు వర్ణించినట్టు. ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ అని ఇంతకు ముందే ఇచ్చాడు పరమాత్మ దీనికి సమాధానం. నా
Page 341