నతదస్తి వినామయా అంటున్నాడు. బీజమంటే నిమిత్త కారణం. మయావినా అంటే ఉపాదాన కారణం. రెండూ పరమాత్మే అన్నప్పుడది అద్వైతులు చెప్పే అభిన్న నిమిత్తో పాదాన కారణమయింది ప్రపంచానికి. అంటే మట్టీ కుమ్మరీ రెండూ పరమాత్మే అయ్యాడు ప్రపంచ సృష్టికి. అలాంటప్పుడిక పరమాత్మకు దూరమయి ప్రపంచమెక్కడ ఉండగలదు. విభువు లేని విభూతి లేశ మాత్రం కూడా లేదని తేట పడుతున్నది. అతః అందుకే మదాత్మకం సర్వం - విభూతి అంతా విభువే నంటున్నాడు భాష్యకారుడు.
పోతే విభువు ప్రదర్శించే ఈ విభూతి మర్త్యం కాదు. దివ్యం. లోకంలో ఒక మాయావి మాయ చూపుతున్నాడంటే అది మర్త్యం. ఎంతో కాలం నిలకడగా ఉండదది. చూచినప్పుడే కనిపిస్తుంది. చూడకుంటే స్వప్నంలాగా విరిసిపోతుంది. కాగా పరమాత్మ చూపుతున్న ఈ జగద్విభూతి సార్వకాలికం. కనుక దివ్యం. అంతే కాదు. ఒకటి కాదిది. అనేకం. దివ్యానాం విభూతీనాం. అసంఖ్యాకంగా ఉన్నాయివి. అండపిండ బ్రహ్మాండాలను మనం లెక్కపెట్టలేము. అవన్నీ భగవద్విభూతే. అంచేతనే నాంతోస్తి. వీటికంతం లేదంటున్నాడు. ఒక మాటలో చెబితే అనంతమూ Infinite విచిత్రమూ varied ఈ సృష్టి, ఇలాటి మహిమ ఏ ఐంద్రజాలికుడూ చూపలేడు. ఏ యోగీశ్వరుడూ చూపలేడు. ఒక బాబా ఏదో బూడిదో కుంకుమో తీసి చేతిలో పెడితే ఆహాహా అని మూర్ఛపోతావు. ఆ బడా
Page 340