గ్రహించవలసింది అర్జునా. న తదస్తి వినామయా. నా స్పర్శగాని సంబంధం గాని లేని పదార్ధమేది గానీ సృష్టిలోనే లేదు. అది చరా చరాలలో ఏదైనా కావచ్చు. అండ పిండ బ్రహ్మాండాలలో ఎక్కడైనా ఉండవచ్చు. నేను లేకుండా ఏదీ పుట్టలేదు. ఉండలేదు. పోలేదు. ఆది మధ్యాంతాలలో నామీద ఆధారపడి బ్రతకవలసిందే. అసలు ప్రతి పదార్థానికీ ఆదీ మధ్యమూ అంతమూ నేనే నని చాటినప్పుడే సమస్తమూ నా స్వరూపమే నని నేను క్రొత్తగా చెప్పనక్కర లేదు. వివేక వంతుడవే అయితే నీవీ పాటికే గ్రహించ వలసిన రహస్యమిది.
నాంతోస్తి మమ దివ్యానాం - విభూతీనాం పరం తప
ఏషతూ ద్దేశతః ప్రోక్తో విభూతే ర్విస్త రోమయా - 40
అంతేకాదు. మయా అపకృష్టం పరిత్యక్తం శూన్యం హి తత్ స్యాత్తంటారు భగవత్పాదులు. పరమాత్మ స్పర్శలేకుండా పోతే ప్రతి ఒక్కటీ అది చేతనమని చెప్పు అచేతనమని చెప్పు. నిరాత్మకమయి పోతుంది. నిరాత్మకమంటే ఆత్మలేనిది. ఆత్మ అంటే స్వరూపం. The very stuff and substance. స్వరూపాన్నే కోలుపోతే అది ఇక శూన్యమే. అసలే లేకుండా పోతుంది. ఒక కుండకు మట్టి అనేది స్వరూపం. అదే దాని ఆత్మ. అది దానినుంచి దూరమైతే ఇక అక్కడ కుండ అనే పదార్ధమే లేదు. అలాగే భగవత్స్వరూపమే ప్రతి దాని స్వరూపమూ. అది దూరమైతే ప్రతి ఒక్కటీ శూన్యమే. అభావమే. ఎందుకంటే అది ప్రతిదానికీ బీజమంటున్నాడు.
Page 339