#


Index

విభూతి యోగము భగవద్గీత

అప్పటికి భగవ ద్విభూతేనని ధ్వనిస్తున్నదీ వర్ణనలో. దేవర్షులలో నారదుడట పరమాత్మ. ఇంతకు ముందు మహర్షులలో భృగువు అన్నాడు. పైకి చూస్తే తేడా కనిపిస్తున్నది. కాని అక్కడ మహర్షులు. ఇక్కడ దేవర్షులు అని పేర్కొనటం మూలాన తేడా తొలగిపోయింది. నారద అంటే నారం దృతి నారం దడాతి - అని రెండర్థాలు. నరులంటే జీవులు. వీరి అజ్ఞానాన్ని ఖండించేవాడూ - వీరిద్దరికీ జ్ఞానాన్ని అందించే వాడూ ఎవడో అతడు నారదుడు. కనుక నే త్రి లోకాలూ తిరుగుతుంటాడా జీవన్ముక్తుడు. గంధర్వాణాం గాన విద్యకు పెట్టిన పేరు గంధర్వులంటే. సంగీతాని కందుకనే గాంధర్వమని పేరు వచ్చింది. దేవ యోనులలో వారొక జాతి. వారందరిలో చిత్రరధుడనే గంధర్వుడు పరమాత్మ. పోతే సిద్ధులని మరొక దేవజాతి ఉంది. జన్మనైవ ధర్మ జ్ఞాన వైరాగ్యైశ్వర్యాలనే నాలుగు సిద్ధులూ అలవడినవారు. వారిలో కపిలుడనే సిద్ధుడాయన. ఈ కపిలుడు సాంఖ్య మత ప్రవర్తకుడైన కపిలా చార్యుడను కొంటారేమో. కాదు. పాతాళంలో తపోనిష్ఠలో ఉండి తనకు తపో భంగం చేసిన సగర పుత్రులను కాల్చి వేసిన విష్ణ్వంశ సంభూతుడు.

ఉచ్చైః శ్రవస మశ్వానాం - విద్ధి మా మృతోద్భవమ్
ఐరావతం గజేంద్రాణాం - నరాణాంచ నరాధివమ్ - 27


  పోతే అశ్వజాతి కంతటికీ నేను చ్చైః శ్రవమనే అశ్వాన్నంటాడు. సముద్ర మధనం చేసినప్పుడు ద్భవించిన దది. శరీరమంతా తెలుపే దానికి.

Page 331

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు