#


Index

విభూతి యోగము భగవద్గీత

పురోహితుడైన బృహస్పతి పరమాత్మ. మరి సేనాం నయతీతి సేనానీః సేనను నడిపే సైన్యాధి పతులందరిలో దేవసేనాపతి స్కందః కుమారస్వామి నంటాడు. సరసామస్మి సాగరః అలాగే సరసాం దేవ ఖాత మైన జలాశయాలకు సరస్సులని పేరు. వాటిలో సాగరమేనట తాను.

మహర్షీణాం భ్యుగు రహం - గిరా మస్త్యేక మక్షరం
యజ్ఞానాం జపయ జ్ఞోస్మి - స్థావరాణాం హిమాలయః - 25


  అలాగే మహర్షులందరిలో భృగు వనే మహర్షిని నేను. పద లక్షణమైన గిరాం వాక్కులన్నింటిలో పక మక్షరం. ఓంకారమనే ఒకే ఒక అక్షరం నేను. యజ్ఞానం యజ్ఞలెన్నో ఉన్నాయి. వాటన్నిటిలో జపయజ్ఞమట. స్థావరాణాం హిమాలయః స్థిరంగా ఉండే పదార్ధాలన్నిటిలో హిమాలయ మట తాను. ఇక్కడ శిఖరాలున్న పర్వతాలలో మేరువైతే స్థావరాలలో హిమాలయ మనటం వల్ల కొంచెం తేడా చెప్పినట్టయింది కాబట్టి పునరుక్తి లేదు.

అశ్వత్థ స్సర్వ వృక్షాణాం - దేవర్షీణాంచ నారదః గంధ ర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః - 26

  మరి వృక్షాలెన్నో ఉన్నాయి లోకంలో. పారిజాతాదు లున్నాయి దేవలోకంలో. కాని అవి ఏవీ గావు. అశ్వత్థః - అన్ని వృక్ష జాతులలోనూ అశ్వత్థమట పరమాత్మ. అశ్వత్థమంటే రావిచెట్టు. ఈ అశ్వత్థ వృక్షంతోనే పోల్చాడు సంసారాన్ని పురుషోత్తమా ధ్యాయంలో. అంటే సంసారమంతా

Page 330

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు