విభూతి యోగము
భగవద్గీత
పోతే ఇక ఋగాదులైన నాలుగు వేదాలలో గానరూపమైన సామవేద మట తాను. అలాగే రుద్రాదిత్యాది దేవతలందరిలో వాసవుడు ఇంద్రుడట. ఇంద్రియాణాం మనః చక్షురాదులైన జ్ఞానేంద్రియాలలో వాగాదులైన కర్మేంద్రియాలలో ప్రాణమనే దానితో సహా ఈ పదకొండింటిలో నేను మనస్సనే ఇంద్రియా న్నంటాడు. అలాగే భూతానా మస్మి చేతనా. సమస్త భూతరాసులకూ చేతన నంటాడు. చేతన అంటే కార్యకరణ సంఘాత రూపమైన శరీరంలో నిత్యమూ అభివ్యక్త మవుతున్న బుద్ధి వృత్తి Con-science అని భగవత్పాదుల మాట.
రుద్రాణాం శంకర శ్చాస్మి విత్తే శోయక్షరక్ష సాం
వసూనాం పావక శ్చాస్మి - మేరుః శిఖరిణా మహమ్ - 23
అలాగే ఏకాదశ రుద్రులలో నేను శంకరుడనే రుద్రుణ్ణంటాడు. యక్ష రక్షసాం. యక్షరాక్షస జాతులలో విత్తేశః కుబేరుణ్ణి నేనంటాడు. వసూనాం పావక శ్చాస్మి. అష్ట వసువులలో అగ్నిని. మేరు శ్శిఖరిణాం. పెద్ద పెద్ద శిఖారాలున్న వాటిలో నేను మేరువును.
పురోధ సాంచ ముఖ్యం మాం విధి పార్ధ బృహస్పతిం
సేనా నీనా మహం స్కందః - సరసా మస్మి సాగరః - 24
రాజ పురోహితులకు పురోధసులని పేరు. పురోధీయతే ఇతి పురోధాః అని వ్యుత్పత్తి. యజమానుడు తన ముందుంచుకొని ఆయా కర్మ లాచరిస్తాడు కాబట్టి పురోహితుడని పురోధనుడని పేరు వచ్చింది. వారిలో దేవేంద్రుడి
Page 329