విభూతి యోగము
భగవద్గీత
గుర్తించి ఆ దృష్టితో విభూతిని చూడాలి దాని విభూతి దృష్టితో స్వరూపాన్ని గాదు. ఈ సూక్ష్మ మతనికి తెలియదు గనుకనే అహమాత్మా గుడాకేశ. నేను కేవల మాత్మ స్వరూపుణ్ణి రా బాబూ. నీవు చూడాలను కొంటున్నది అనాత్మ రూపమైన నా విభూతి అని మొదట స్వరూప జ్ఞాన మందించా డతనికి భగవానుడు. అలా అందించి ఇక ఆ దృష్టి వదలకుండా చూడమని చెప్పటానికా చూడవలసిన భగవ ద్విభూతి ఏదో అది చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తున్నాడిప్పుడు.
అందులో కూడా మొట్టమొదట సూర్య చంద్ర నక్షత్రాది గోళాలుగా విస్తరించిన తన రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదిత్యానా మహం విష్ణుః ఆదిత్యులని ఉన్నారు పన్నెండుమంది. వీరినే ద్వాదశా దిత్యులంటారు. ఎక్కడో లేరు వారు. అంతరార్ధం చెప్పుకొంటే పన్నెండు మాసాలలో కనిపించే పన్నెండు రూపాలవి. వారిలో విష్ణువని ఒక ఆదిత్యుడికి పేరు. ఆదత్తే ఇత్యాదిత్యః ఎక్కడెక్కడి జలాన్నీ పీల్చేస్తుంటాడు కాబట్టి ఆదిత్యుడనే సంజ్ఞ సార్ధకంగా ఏర్పడ్డది సూర్యుడికి. పోతే జ్యోతిషాం రవి రంశుమాన్. అన్ని ప్రకాశాలలోనూ రవి అనే ప్రకాశం నేనే నంటాడు. మరీచి ర్మరుతా మస్మి. మరుత్తులనే దేవత లొకరున్నారు. సప్త మారుతాలని పేరు వారికి. వారిలో మరీచి అనే వాడు పరమాత్మేనట.
వేదా నాం సామ వేదో స్మి - దేవానా మస్మి వాసవః ఇంద్రియా ణాం మనశ్చాస్మి - భూతానా మస్మి చేతనా - 22
Page 328