#


Index

విభూతి యోగము

అడిగాడు చెప్పమని. కేవలం విభూతినే అడగలేదు. విస్తరేణాత్మనో యోగం విభూతించ అని రెండూ అడిగాడు గదా. అడిగింది వాస్తవమే గాని భగవత్తత్త్వం కంటే దాని విభూతి మీదనే ఉందతనికి మోజు. అయితే ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తి అని కండిషను పెట్టాడు పరమాత్మ. రెంటినీ కలిపి పట్టుకోవాలి సుమా. ఒకటిగాదు. అలాగైతేనే అసమ్మూఢస్స మర్త్యేషు. వాడు మూఢు డనిపించుకోడు. అంతేగాక సర్వపాపైః ప్రముచ్యతే అన్ని పాపాల నుంచీ బయటపడతా డన్నాడు. అంచేత స్వరూపాన్ని అడిగి తెలుసుకోకపోతే మోక్షం మాట అలా ఉంచి అసమ్మూఢుణ్ణి అనిపించుకో లేనేమోనని - అలాగే పాప విముక్తుణ్ణి కానేమో నని - బహుశా భయపడి ఉంటా డర్జునుడు. కాబట్టి అందుకోసమైనా అడిగి ఉంటాడు నీ స్వరూపమేమో చెప్పమని. అంతేగాని విభూతి మీద ఉన్నంత అభిలాష యోగం మీద అంతగా లేదతనికి. ఏదో మాటసామెతగా అడిగాడంత మాత్రమే. అలాగే అడిగాడని చెప్పటాని కతడు ప్రశ్నించిన తీరే మనకు నిదర్శనం. కేషు కేషుచ భావేషు చింత్యోసి అని ప్రశ్నిస్తాడు. నిన్ను నేనేయే రూపాలలో ధ్యానించాలని అడుగుతాడు. అంటే ఏదో ఒక రూపంలో చూడాలనుకొంటున్నాడే గాని అసలైన స్వరూపంతో పరమాత్మను పట్టుకోవాలని లేదనేగా అభిప్రాయం. అసలైన స్వరూపం సచ్చిదాత్మకం. అది అర్జునుడి దృష్టిలో లేదు. అది లేకుండానే విభూతి ద్వారా పట్టుకొందామను కొంటున్నాడు స్వరూపాన్ని. ముందుగా స్వరూపమేమిటో

Page 327

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు