#


Index

విభూతి యోగము

కా నిద్రా తస్యా ఈశన శీలః అని ఆయన వ్యాఖ్యానం. నిద్ర అంటే స్వరూపాన్ని మరచి పోవటం. అలాటి మరపు లేనివాడు గుడాకేశుడు. అలాంటి వాడికే ఇది సంసారం గాదు భగవద్విభూతి. అలా కాకుంటేనో. దానికీ అర్ధం చెప్పారు భాష్యకారులు. ఘనకేశోవా అని. అంటే అర్ధం. బాగా ఒత్తుగా జుట్టు పెంచుకొన్న వాడని అర్థం. సర్వత్రా ఉన్నది ఆత్మ చైతన్యమేనని గుర్తించి ఆ దృష్టి ఏమరకుండా అనాత్మ ప్రపంచాన్ని చూడగలిగితే నీవు గుడాకా ఈశుడవే. అలా చూడలేవా. నీవు కేవలం ఒక పొదలాగా జుట్టు పెంచుకొన్న గూడా కేశుడవే నని కృష్ణ పరమాత్మ చేసే వేళాకోళం. అర్జునుడనే గాదు. మనబోటి మానవులకు కూడా ఇది పెద్ద సవాలు. నీకు నిజమైన ఆత్మ జ్ఞానమే ఉంటే సర్వత్రా ఆత్మే వ్యాపించినట్టు చూడు మరి. అప్పుడు నీవే పరమాత్మవు. నీ విస్తారమే ఈ ప్రపంచమంతా. అలా కాదో . నీవు నిక్షేపరాయుడవు. కేవలం వేషభాషలతో బ్రతుకుతున్న మానవ మాత్రుడవు. నీకూ మిగతా పశుపక్ష్యాదులకూ తేడా అణుమాత్రం లేదు సుమా. ఇందులో ఏ స్థాయి నందుకోవాలను కొంటున్నావో నిర్ణయించుకో అని పెద్ద హెచ్చరిక.

ఆదిత్యానా మహం విష్ణు ర్జ్యోతిషాం రవి దంశుమాన్
మరీచి ర్మరుతా మస్మి - నక్షత్రాణా మహం శశీ - 21


  ఇక ఇక్కడి నుంచీ చూడండి. తన విభూతిని బ్రహ్మాండంగా వర్ణిస్తూ పోతాడు పరమాత్మ. పాప మర్జునుడు స్వరూపాన్ని అడిగాడు విభూతినీ

Page 326

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు