#


Index

విభూతి యోగము

వెలపల కూడా తానే వ్యాపించాడని అర్థ మవుతున్నది. పోతే లోపలా వెలపలా పరమాత్మే అయితే ఇక ఆ పదార్థ రూప మేమయినట్టు. అది ఆ రెండర్రాలకూ మధ్యలో గదా ఉన్నది. ప్రస్తుత మా మధ్యం కూడా నేనే నంటున్నాడు. ఇలా ఆది మధ్యాంతాలు మూడూ పరమాత్మ చైతన్యంతోనే నిండిపోయి నప్పుడిక ఆ పదార్ధ మెక్కడ ఉంది. ఎలా ఉంటుంది. ఉండటానికి దానికి జాగా ఏది. లేదు. అయితే ఏమిటది. పరమాత్మే. పరమాత్మే అయితే ఆయా భూతకోటిగా ఎలా కనిపిస్తున్నది మనకు. కనిపిస్తున్నది. కాని ఆ కనిపించేది చరాచర ప్రపంచం గాదు. మరేమిటి. పరమాత్మే అలా కనిపిస్తున్నాడు. దీనికే ఆ భాస అని పేరు. చైతన్యంగా స్వరూపమైతే ఆభాసగా ఇది దాని విభూతి. అది యోగం - ఇది విభూతి. మొదటినుంచీ యోగం విభూతి అని అడుగుతూనే వచ్చాడర్జునుడు. చెబుతూనే ఉన్నాడు కృష్ణుడు. ఇప్పుడిక్కడ తెగేసి చెబుతున్నాడవి రెండూ వేరు గావు రా బాబూ రెండూ నా స్వరూపమే. రెంటినీ వేరు చేసి చూడకు. కలిపి పట్టుకో. అది కూడా స్వరూప జ్ఞానంతో పట్టుకో విభూతిని. అప్పుడే అది భగవద్విభూతి అని దర్శించగలవు. లేకుంటే విభూతి కాదది. సంసార మయి నిన్ను బంధిస్తుంది. ఇంత ఉన్నదిందులో అంతరార్ధం.

  అయితే ఇంతకూ పట్టుకొన్నాడా లేదా అర్జునుడు. పట్టుకొన్నాడో లేదో గాని గుడాకేశ అని మాత్రం సంబోధించా డతణ్ణి భగవానుడు. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడని అర్ధం చెప్పారు భగవత్పాదులు. గుడా

Page 325

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు