విభూతి యోగము
భగవద్గీత
చెవులు చాలా పొడవుగా ఎత్తుగా ఉంటాయి. కనుక దానికా పేరు వచ్చింది. దేవేంద్రుడు దాన్ని తనకు హక్కు భుక్తం చేసుకొన్నాడు. అది నేనేనని తెలుసుకోమంటాడు. అంతేనా. ఐరావతం గజేంద్రాణాం. గజ జాతి ఎంత ఉందో వాటన్నిటిలో ఐరావత మనే గజేంద్రుణ్ణి నేనంటాడు. ఇరావతి అనే దాని సంతాన మైరావతం. ఇదీ అమృతోద్భవమే. అంటే క్షీర సాగరం నుంచి జన్మించిందే. ఉచ్చైః శ్రవంలాగా ధవళ వర్ణమే. ఇదీ దేవేంద్రుడి సొంతమే. నరాణాంచ నరాధిపం - నరులందరిలో నరాధిపుడైన చక్రవర్తి నంటాడు.
ఆయుధానా మహం వజ్రం ధేనూనా మస్మి కామధుక్
ప్రజన శ్చాస్మి కందర్పః - సర్వాణా మస్మి వాసుకిః - 28
ఆయుధాలన్నిటిలో వజ్రాయుధం నేను. దధీచి మహర్షి వెన్నెముకతో తయారయిందది. అంచేత మహాశక్తి సంపన్నమైనది. అదీ దేవేంద్రుడి ఆస్తే. మరి గోవులన్నిటిలో పాలిచ్చే గోవులకే ధేనువులని పేరు. వాటిలో కామధుక్. సర్వకామాలనూ ప్రసాదించే కామధేనువు నంటాడు. వసిష్ఠాది మహర్షుల దగ్గరా ఉందిది. దేవేంద్రుడి దగ్గరా ఉంది. ఇదీ క్షీర సాగరం నుంచి జన్మించిందే. ప్రజచ శ్చాస్మి కందర్పః సకల జీవుల జన్మకూ హేతువైన కందర్పః కామః కామ పురుషార్ధాన్ని నేను. అలాగే సర్పాణాం వాసుకిః - సర్వజాతులెన్నో ఉండగా అందులో వాసుకి అనే సర్పరాజును నేను.
Page 332