#


Index

విభూతి యోగము

  అంచేత అహమనే భావమే ఉంది గాని మన కాత్మగాదది. అహ మాత్మే గదా అనవచ్చు. కాదు. సర్వత్రా వ్యాపించిన అహమైతే ఆత్మ. ఆత నోతీతి ఆత్మా. సర్వత్రా ప్రసరించే స్వభావ మున్న జ్ఞానమేదో అది ఆత్మ అని ఆత్మ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పారు భగవత్పాదులు. అలాంటప్పుడు శరీరైక దేశ నియంత్రితమైన నీనా అహం ఆత్మ ఎలా అవుతుంది. అహంకార Ego మని పేరు దీనికి. మరి ఆత్మో. ఈ అహమే సర్వ భూతాలలో వ్యాపించిన చైతన్యమైతే అది ఆత్మ. అప్పటికి సమష్టి చైతన్య మాత్మ. వ్యష్టి చైతన్య మహం. ఆత్మ మన దగ్గర అహం అయితే మన అహం ఈశ్వరుడికి ఆత్మ. కనుకనే అహ మాత్మా అని చాటుతున్నాడు. కారణం. సమస్త భూతాలలో వ్యాపించి ఉన్న అహం నాది కనుక ఆత్మను నేనే. నీవు గావు. నీవు కేవల మహంకారమే. ఒకవేళ నన్నూ నీవహంకారమే అనేట్టయితే నీలాగా పరిచ్ఛిన్న Limittedమైన అహంకారం కాను నేను. పుర్ణాహంకార మంటే అను. నాకాక్షేపణ లేదంటాడు.

  అయితే ఒక ప్రశ్న. సర్వవ్యాపకమని టైటిలిచ్చి నప్పుడా ఈశ్వరుడు అన్నింటి లోపలే ఉంటే ఎలా అవుతాడు వ్యాపకుడు. లోపలా వెలపలా కూడా వ్యాపించాలి గదా. అంతేగాక సర్వమూ తనకు విలక్షణంగా కనిపిస్తున్నా వ్యాపకుడు కాలేడు. వాటి ప్రతి అణువూ తానే అయిపోవాలి. అప్పుడే వ్యాప్తి అనేది సమగ్ర మనిపించుకొంటుంది. వ్యాప్తి మూడు విధాలని గదా చెప్పాము. అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి స్వరూప వ్యాప్తి. ఇది ఎప్పటికీ

Page 323

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు