విభూతి యోగము
భగవద్గీత
ఉంటుందెప్పుడూ. అంతః స్ఫురంతం సదా స్వాత్మా న మన్నారు భగవత్పాదులు. నేను నేననే స్ఫురణే అది. అదే ఆత్మ అంటే. అది ఇప్పుడెక్కడ ఉందని. నీలో ఉందది నాలో ఉందది. ప్రతి ఒక్కడూ మనలో నేనున్నాని భావిస్తున్నాడా లేదా. అదే అహం - అదే ఆత్మ. ఇప్పుడు పరమాత్మ అనే మాటేమిటి. నీవనుకొనే నేనే నేను కూడా నంటున్నాడు. అప్పటికేమయింది. పరమాత్మ అని నీవు కలగంటున్న వాడెక్కడో దూరంగా లేడు. ఈ నేను నేననుకొనే జీవాత్మే పరమాత్మ.
మంచిదే. జీవాత్మ పరమాత్మే అయినప్పుడిక నీకూ నాకూ ఈ సమస్య ఎలా ఏర్పడింది. జనన మరణాదికమైన సంసార బంధమెలా ప్రాప్తించిందని ప్రశ్న. దానికి సమాధాన మిస్తున్నా డాయనే. సర్వ భూతాశయ స్థితః సమస్త భూతాల లోపలా వ్యాపించి ఉన్నాడట. ఇదుగో ఇక్కడ వచ్చింది తిరకాసు. ఆయన వ్యాపించి ఉన్నాడు. మనమలా వ్యాపించ లేకపోతున్నాము. వ్యాపించ గలిగితే ఈ ఒక్క శరీరాన్నే పట్టుకొని ఎందుకు వేళ్లాడుతాము. అన్ని శరీరాలలో ప్రవేశించి అవన్నీ నేనే ననుకోవచ్చు గదా. అలా కాక ఆపాదమస్తకమూ ఒక్క శరీరాన్నే నేనని అభిమానిస్తున్నాము యావజ్జీవమూ. నీవెవడవు ఎక్కడ ఉన్నావని అడిగితే ఈ మూడు మూరల జానెడు శరీరాన్నే గదా చూపుతున్నాము. విశ్వమంతా నా శరీరమేనని చూపగలవా. మరి ఈశ్వరుడైతే అలా చూపగలడు. అదేగదా క్షేత్ర జ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు అని చెబుతాడు క్షేత్రజ్ఞాధ్యాయంలో. ఇక్కడా చెబుతున్నా డ దేమాట సర్వభూతా శయ స్థితః అని.
Page 322