#


Index

విభూతి యోగము భగవద్గీత

స్వరూప జ్ఞానమున్న దున్నట్టు గ్రహించ కుండా విభూతి నెంత వాటేసుకొన్నా ఫలితమివ్వదని అతనికి తెలియదు. ఈ సత్యాన్ని తెలపటానికే ప్రస్తుతం భగవానుడు తన స్వరూపాన్ని యధాతధంగా వర్ణిస్తున్నాడు. అందులో కూడా స్వరూప జ్ఞాన మేమరకుండా నా విభూతిని దర్శించు. అప్పుడే రెండింటినీ నీవు సమన్వయం చేసుకోగలవనే అభిప్రాయం కూడా చాలా సూక్ష్మంగా ధ్వనింప జేస్తున్నాడు.

అహ మాత్మా గుడాకేశ - సర్వభూతా శయ స్థితః
అహ మాదిశ్చ మధ్యంచ భూతానా మంత ఏవచ 20


  ఇప్పుడీ శ్లోక మన్ని ప్రశ్నలకూ జవాబు. స్వరూప జ్ఞానమూ ఇక్కడే ఉంది. విభూతి జ్ఞానమూ ఉంది. రెండూ రెండుగా గాదు మరలా. ఒకటిగా. ఆ ఒకటీ కూడా విభూతిగా గాదు. విభూతి స్వరూపంగా. అహ మాత్మా నేను ఎవరను కొంటున్నావో. ఆత్మనే. చూడండి. పరమాత్మ ఎవరో ఆయన ఎక్కడో ఉన్నాడు. బహుశా మనకు దూరంగా ఏ వైకుంఠంలోనో ఏ కైలాసంలోనో ఏ లోకాంతరాలలోనే మనకు కనపడకుండా నివసిస్తున్నాడు. ఎప్పటికైనా కృషి చేసి అక్కడికి వెళ్లి ఆయనను మనం దర్శించి ధన్యులం కావలసి ఉంటుందనే ఒక అపోహ మనకందరికీ ఉందిప్పుడు. దాన్ని తిప్పి కొడుతున్నదీ మాట. నేనెక్కడనో లేనురా. ఎవడనో కాదు కూడా. నీ స్వరూపమే సుమా నేను. అని హెచ్చరిస్తున్నాడు మనలను. ఆత్మ అంటే స్వరూపమనే అర్థం. అది అహం తా రూపంగానే Subjective

Page 321

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు