జ్ఞాన యోగము
భగవద్గీత
ప్రధానమంటే ఏమిటో వ్యాఖ్యానిస్తున్నారు భాష్యకారులు. యత్ర యత్ర ప్రధానా యాయా విభూతిః తాంతాం కధయిష్యామి. ఏయే జాతులలో ఏది తలమానికంలాగా భాసిస్తుంటుందో అది ఆ జాతికంతా ప్రధానం. అదే నీకు బోధిస్తాను. అశేష తస్తు వర్ష శతేనాపి నశక్యా వక్తుం - శేషం లేకుండా సమస్తమూ ఏకరువు పెట్టటమనేది వంద సంవత్సరాలు నీవు బతికినా నీవర్ధం చేసుకోలేవు. నీకర్ధ మయ్యేలాగా నేను చెప్పాలే నంటాడు. ఇక్కడ ప్రాధాన్యమనేది రెండర్థాలలో తీసుకోవాలి మనం. ఆ జాతి పదార్ధాలన్నిటికీ ముఖ్యమైన దని అర్థమే. అది ఆ జాతి కంతటికీ ລ້ Representative or Indicative .
పోతే ఇక్కడ ఒక ప్రశ్న వస్తున్నది. అర్జునుడు భగవద్విభూతినే గాక భగవత్స్వరూపాన్ని కూడా చెప్పమని ప్రశ్నించాడు గదా. విస్తరేణాత్మనో యోగం విభూతించ. యోగం విభూతీ రెండూ చెప్పమని గదా అతని ప్రశ్న. అలాంటప్పుడు విభూతిని మాత్రమే చూడాలనుకొన్నాడని - మనం వ్యాఖ్యానించటమేమి న్యాయమని అడగవచ్చు. నిజమే. రెండూ చెప్పమనే అడిగాడు. కాని అది పరమాత్మ స్వరూపాన్ని ఉన్నదున్నట్టు పట్టుకోవాలనే జిజ్ఞాసతో అడిగింది కాదు. కేషు కేషుచ భావేషు చింత్యోసి. నిన్ను ఏయే రూపాలలో పట్టుకోవాలో చెప్పమని అడగటంలోనే బయట పడుతుందతని చాపల్యం. అసలైన భగవద్రూపాన్ని కూడా దాని విభూతి విశేషాల ద్వారానే పట్టుకోవాలని అతని ఆశయం. అది అతని గొంతెమ్మ కోరికే గాని
Page 320