విడివిడిగా పట్టుకోవాలనా. అలా కాక రెండూ కలిపి ఒకటిగా పట్టుకోవాలనా. విడిగా పట్టుకొంటే అది ద్వైత దృష్టి. అద్వైత దృష్టి కాదు. రెండూ కలిపి పట్టుకొన్నా విభువును విభూతితో ఏకం చేసి పట్టుకొంటే అదీ ద్వైతమే గాని అద్వైత దర్శనం కాదు. అలాకాక విభువనే దేదో దాని జ్ఞానంతో విభూతిని దర్శించినప్పుడే అది అద్వైతాను భవానికి దారి తీస్తుంది. ఇలాటి జ్ఞాన మందిస్తే భగవానుడందు కోటానికి సిద్ధంగా ఉన్నాడా అర్జునుడు. ఏమో. అతని మాటలలో మాత్రమున్నట్టే కనిపిస్తుంది. కాని మాటలో స్పష్టంగా బయటపడదు.
ఎలాగంటే విస్తరేణా త్మనో యోగం - విభూతించ భూయః కథయ సవిస్తరంగా బోధించమని అడుగుతాడు. ఏమిటా బోధించవలసింది. యోగంచ విభూతించ. యోగమూ విభూతీ రెండూ నంటాడు. మరి రెండూ నని వాచా చెబుతున్నాడుగదా. స్వరూప విభూతులు రెండింటిమీదా దృష్టి ఉన్నట్టే గదా అర్జునుడి కని అప్పుడే కితాబివ్వకండి అతనికి. విభూతించ అని చకారం ప్రయోగించాడు కాబట్టి మహర్షి రెండూ కలిపి పట్టుకొనే అభిప్రాయ మున్నట్టు తోస్తుంది. అంతవరకూ పరవాలేదు. కాని ఆ కలిపి పట్టుకోట మంటున్నామే అది స్వరూపాన్ని విభూతిలో కలపటమా. విభూతిని స్వరూపంలో కలపటమా అని ప్రశ్న. విభు జ్ఞానముంటే గాని విభూతిని విభువనే భావంతో చూడలేము. అలాకాక కేవల విభూతి భావమే ఉన్నట్టయితే విభువప్పుడు దూరమయి పోతాడు. కాబట్టి కలిపి
Page 316