వింటానంటాడు. దివ్యమనే మాట ఎందుకు వచ్చిందంటే అది కూడా వివరిస్తున్నాడు తానే. యాభి ర్విభూతిభి ర్లోకా నిమాం స్త్వం వ్యాప్య తి ష్ఠసి ఈ పద్నాలుగు లోకాలనూ నీవా విభూతులతోనే గదా వ్యాపించి కూచున్నావు. మరి దివ్యం గాకపోతే మర్త్యమా అవి. మర్త్యమైతే ఈ మర్త్యలోకం వరకే పరిమిత మయ్యేదది. అలాకాక దేశకాలాదులన్నీ వ్యాపించి నప్పుడది మర్త్యం కాదు దివ్యమే. అలాటి దివ్యమైన నీవిభూతిని ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది తెలపమని బ్రతిమాలుతాడు.
కధం విద్యా మహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్
కేషు కేషుచ భావేషు - చింత్యోసి భగవన్ మయా - 17
విస్తరేణాత్మనో యోగం- విభూతించ జనార్దన
భూయః కధయ తృప్తిరి- శృణ్వతో నాస్తి మే మృతమ్ - 18
కధం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ - అసలు మహాత్మా నిన్ను నేనెలా గుర్తించాలి. నీ రూపాన్ని నేనెలా చింతించాలో చెప్పమంటాడు. అంతే కాదు. కేషు కేషు చ భా వేషు చింత్యోసి మయా. ఏయే భావాలలో నిన్ను నేను భావించాలో వివరంగా బోధించమని ప్రాధేయపడతాడు. ఏమిటీ అర్జునుడి ఆరాటం. పరమాత్మను పరమాత్మగా అర్థం చేసుకోవాలనా లేక ఆయా రూపాలలో దర్శించాలనా. పరమాత్మగా అయితే అది స్వరూపం. ఆయా భావాలలో నంటే అది విభూతి. ఇంతకూ స్వరూప జ్ఞానం కావాలా అర్జునుడికి. విభూతి జ్ఞానం కావాలా. రెండూ
Page 315