#


Index

విభూతి యోగము

వీడే ఎప్పటికైనా భగవత్తత్త్వాన్ని అనుభవానికి తెచ్చుకోటానికి సమర్ధుడని ఇంతకూ ఫలితార్ధం. అల మేతావతా. ప్రకృత మనుసరామః.

వక్తు మర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః
యాభి ర్విభూతి భిర్లోకా నిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి-16


  ఇప్పుడీ అర్జును డెలాటి మానవుడని ప్రశ్న. వీడు సమర్ధుడా. అసమర్ధుడా. కొంత సమర్థుడు. కొంత అసమర్థుడు అని జవాబు. ఎలాగంటే భగవద్విభూతి ఏమిటో అది మాత్రమే తెలుసుకుందామని అతని అభిలాష. భగవత్తత్త్వం వరకూ వెళ్లటం లేదతని దృష్టి. యోగం గ్రహించకుండా కేవలం దాని విభూతిని గ్రహిస్తే ప్రయోజనం లేదు. అది పరిపూర్ణమైన జ్ఞానమని పించుకోదు. అది విని అర్ధం చేసుకొనే సామర్ధ్యం లేదర్జునుడికి. విభువు గాక ఆయన విభూతిని చూడాలని ఉబలాట పడుతున్నాడు. అంత వరకే ఉందతనికి సామర్ధ్యం. ఎందుకా సామర్ధ్యం. ఉంటే ఎంత. లేకుంటే ఎంత. ఎందుకని. విభువు నుంచి విభూతిని వేరు చేసి చూడటం ఒక చూపే గాదు. అది బంగారమనే జ్ఞానం లేకుండా కటక కుండలాదులైన ఆభరణాలు చూడటం లాంటిదే.

  అలాటి హ్రస్వ దృష్టి తోనే అడుగుతున్నా డిప్పుడు. ఏమని. వక్తు మర్హ స్యశేషేణ - దివ్యాహ్యాత్మ విభూతయః - స్వామీ - నీవిభూతి ఒకటి గాదు. అసంఖ్యాకంగా ఉన్నాయి. అవన్నీ దివ్యమైనవి. అవి ఎన్నో ఎలాటివో అశేషేణ - ఏదీ మిగల్చకుండా అన్నీ నాకు చాటి చెప్పు

Page 314

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు