కొన్న మానవుడు దేవతలకన్నా మహర్షుల కన్నా గొప్పవాడని గదా తాత్పర్యం.
అంతేకాదు. ఆ మాటకు వస్తే దేవతలూ ఋషులూ దానవులూ
ఎక్కడో లేరు. మానవుడే ఆత్మ జ్ఞానంతో ప్రకాశిస్తే వాడే దేవ. అలాటి
దర్శనముంటే వాడే ఋషి. అలాటి చైతన్య ప్రకాశంలో తమస్సు లాంటి
ఈ నామరూపాత్మక సృష్టిని తన విభూతిగా భావిస్తే వాడే దానవ.
అంతవరకూ వారిని దూరంగా తన కతీతంగా ఎక్కడో ఉన్నారని
ఊహిస్తుంటాడీ మానవుడు. ఆత్మ జ్ఞానమే లభిస్తే వారెక్కడో లేరు. తన
స్వరూపమే తన విభూతేనని అర్థం చేసుకొంటాడు. దైవాసుర సంపదలే
గదా దేవ దానవులు. అవి మానవుడి మనోభావాలనే గదా పేర్కొన్నాము.
దదద అని బృహ దారణ్యం దేవ దానవ మానవులకు ముగ్గురికీ మూడు
చెప్పిందంటే ఆ ముగ్గురూ ఎక్కడున్నారు. ఆ మూడూ ఎవరభ్యసించాలి.
దమ దాన దయలు మానవుడే గదా అలవరుచుకో వలసిన గుణాలు.
అందులో దమ మలవరుచుకొంటే వాడు దేవత. దయ అలవరుచుకొంటే
వాడు దానవుడు. దాన మలవరుచుకొంటే మానవుడు. కామక్రోధ లోభాలనే
దోషాలు వీడికే వాటికి విరుద్ధమైన దమ దాన దయా గుణాలు వీడినే
గదా ప్రజాపతి ఉద్దేశించి బోధ చేశాడు. అలాగే గదా భగవత్పాదులు
భాష్యమను గ్రహించా రక్కడ. కాబట్టి దేవ ఋషి దానవులనే జాతులు
మానవుడి జ్ఞాన భూమి కలకు కేవలం సంకేతాలు మాత్రమేనని కాబట్టి
Page 313