భగవానుడు. వారికి మాత్రమే తెలియదని చెబుతున్నాడు. వారికి తెలియదంటే మనకు కూడా అన్వయించుకోటం దేనికి. వారికి లేని అవకాశం మన కుండవచ్చు గదా. ఉందని సూచించటానికే వారి లిస్టులో మానవులను చేర్చలేదేమో. అలా ఎందు కనుకోరాదు. ఏమో అంత వారికే తెలియని భగవత్తత్త్వం మానవమాత్రులమైన మనకంతు పడుతుందా అని సందేహిస్తున్నారా. అలా సందేహించ నక్కర లేదని నమ్మటాని కాయన మాటే మనకు నిదర్శనం. ఏమిటది. యోమా మజమ నాదించ వేత్తి. అసమ్మూఢ స్స మర్త్యేషు - సర్వపాపైః ప్రముచ్యతే. ఇది చాలు ఈ మాట. మనకు ఆయన ప్రసాదించిన గొప్ప వరం. దేవ దానవ మహర్షుల విషయంలో నవిదుః అన్నవాడు మానవుల విషయంలో ఏమంటున్నాడో విన్నారా. వేత్తి అంటున్నాడు. వారెవరికీ తెలియక పోయినా మానవుడికి మాత్రం తెలిసే అవకాశముందట. పైగా మర్యేషు అని కంఠోక్తిగా చెబుతున్నాడు. మర్త్యుడినని భయపడ నక్కర లేదు మానవుడు. సమ్మూఢు డయితేనే మర్త్యుడు వీడు. అసమ్మఢుడైతే అమర్త్యుడే కాగలడు. అంటే తానే పరమాత్మనని గుర్తించకపోతే వీడికి జనన మరణాలు తప్పవు గాని గుర్తిస్తే మాత్రం వీడు నాలాగే అజుడూ అమరుడూ కాగలడు. వీడికే ఉంది ఆ భాగ్యం. అది దేవ దానవ జాతులకు వేటికీ లేదు. మహర్షుల కంతకన్నా లేదని భంగ్యంతరంగా చాటుతున్నాడు. అప్పటికి పరమాత్మ జ్ఞానం సంపాదించే అవకాశం మానవ జాతికే ఉందని అది ఉపయోగించు
Page 312