విభూతి యోగము
భగవద్గీత
వశంలో ఉన్నప్పుడేది సాధ్యం కాదు. కనుకనే గదా పరమాత్మ పరమాత్మగా నిర్గుణమైనా సగుణమైన అవతారాలన్నీ ధరించగలుగు తున్నది. అదే గదా అజోపి సన్నవ్యయాత్మా. సంభవామ్యాత్మ మాయయా అని ఆయనే స్వయంగా చాటుతూ వచ్చిన సత్యం.
అయితే ఇక్కడ ఒక పెద్ద ఆశంక. పరమాత్మే పరమాత్మను తెలుసుకోవలసి వస్తే ఇక మనబోటి జీవాత్మ గతి ఏమిటి. మనమిక ఎప్పటికీ ఆయనను గుర్తించ లేమనే గదా అర్థం. అంతేగాక దేవదానవ మహర్షులకే అంతుపట్టేది కాదని కూడా చెప్పినప్పుడిక మానవ మాత్రులమైన మనకసలే లేదని గదా ఆశ. అలాగే అయితే ఇక శ్రవణ మననాదులు మనం సాగించట మనవసరం గదా. అలా చేయమని మనకు బోధించే శాస్త్ర వాఙ్మయం కూడా అనావశ్యకమే గదా అని ప్రశ్న వస్తుంది. పైకి చూస్తే దీనికి సమాధానం లేదనే తోస్తుంది. కాని వ్యాస భగవానుడి మాటలలోనే దీనికతి నిగూఢంగా ఉంది సమాధానం.
అదేమిటంటే నమే విదు స్సురగణాః ప్రభవం న మహర్షయః విదుర్దేవా న దానవాః - మహర్షులూ దేవతలూ దానవులూ - వీరెవరికీ అర్ధం కాదు నాతత్త్వమన్నాడే గాని పరమాత్మ మానవులమైన మన సంగతి చెప్పటం లేదు. వారికి తెలియదంటే మనబోటి మానవులకు కూడా తెలుసుకొనే అవకాశం లేదోమోనని మన మనవసరంగా కంగారు పడుతున్నాము. మనకు తెలియదని వాచా ఎక్కడా చెప్పటం లేదు
Page 311