విభూతి యోగము
భగవద్గీత
వలసిన దైతే తెలుసుకొనే దెలా అవుతుంది. తానే జ్ఞాతా తానే జ్ఞేయ మెలా కాగలడు. అది సంభవమా.
పురుషోత్తమ అనే సంబోధనలో ఉన్నది మర్మం. పూర్ణ
స్వరూపుడెవడో వాడు పురుషోత్తముడు. పూర్ణమన్నప్పుడు ఆత్మానాత్మలనే
తేడా రాదు. అనాత్మ కూడా ఆత్మే అవుతుంది. అప్పుడే అది పూర్ణం.
అలాంటప్పు డనాత్మ అనేది ఖాళీయే గదా. ఇక దాన్ని తెలుసుకోట మేమిటి.
భూత భావన భూతేశ అనే మాటలు దానికి సమాధానం. అనాత్మ భావం
ఖాళీ అయినా దాన్ని భర్తీ అయినట్టు చూపగలడా పరమాత్మ. అదే భూత
భావన. భూత ప్రపంచాన్ని తనకంటే అన్యంగా లేకపోయినా ఉన్నట్టు
చూపటమే భావనం. దానికి కారణం ఆయనతో ఓత ప్రోతంగా ఉన్న
మాయా శక్తి. ఆయన మాయావి. అది మాయ. అదే ఆత్మకు భిన్నంగా
అనాత్మను బయటపెడుతుంది. అయినా అది తనకు భిన్నమయి ఆయనను
బాధించదు. కారణం ఆయన భూతేశుడు. దాన్ని ఒక గారడీవాడు తన
గారడీని వశంలో ఉంచుకొన్నట్టు వశీకరించుకొన్న వాడు. అంతేగాక దేవ
దేవుడూ జగత్పతీ కూడా. దీవ్యతీతి దేవః ఏది ప్రకాశిస్తుందో అది
దేవ. అన్నీ భౌతిక ప్రకాశాలైతే అది అభౌతికమైన చైతన్య ప్రకాశం. కనుక
జగత్పతి. చేతనా చేతన ప్రపంచాన్నంతా వ్యాపించి దాన్ని పాలిస్తున్నది.
కనుక పరిచ్ఛిన్నమైన మన దృష్టి కసాధ్యమైనా పరిపూర్ణమైన పరమాత్మ
దృష్టి కంతా సాధ్యమే. అఘటన ఘటనా పటీయసి అయిన మాయా శక్తి
Page 310