విభూతి యోగము
భగవద్గీత
దానికి కారణమొక్కటే. అది పరమాత్మే బయటపెట్టాడు. అహ మాదిర్హి దేవానాం మహర్షీణా మని ఇంతకు ముందే దేవతలకూ మహర్షులకూ కూడా నేను ముందున్నప్పుడు వారికి నీనెలా అర్థమవుతానని దాని అంతరార్ధం తనకు బాగా బోధపడ్డా పడకున్నా ఆయన అన్న మాటను మాత్రం పట్టుకొని అదే సాగదీస్తున్నా డర్జునుడు ఏమని.
స్వయమే వాత్మనా త్మానం - వేత్థత్వం పురుషోత్తమ
భూత భావన భూతేశ- దేవ దేవ జగత్పతే - 15
బావా నీ స్వరూపమిద మిత్థామని ఎవరికీ తెలియ దంటున్నారు మీరు. అటు దేవతలకూ ఇటు దానవులకూ మాత్రమే గాక మహర్షులకు కూడా అంతుపట్టే విషయం కాదని ఇంతకు ముందే సెలవిచ్చారు. అలాంటప్పుడిం కెవరున్నారు తెలుసుకునే సమర్థులు. తెలుసుకొంటే వీరే గదా తెలుసుకోగలవారు. వీరికే అర్ధం కాదని ఎప్పుడన్నారో ఇంకెవరూ లేరు. ఎవరూ లేరంటే ఇంక భగవత్తత్త్వాన్ని ఎవరు తెలుసుకోవాలని. ఎవరూ కాదని ఎప్పుడన్నాడో ఇక మిగిలిపోయిం దెవడు. భగవాను డొక్కడే. కనుక స్వయమే వాత్మ నాత్మానం వేతత్వం - నిన్ను నీవే స్వయంగా తెలుసుకొంటున్నా వన్న మాట. అంటే పరమాత్మను తెలుసుకొనే వాడు పరమాత్మే. మరెవరూ గాదు. అయితే పరమాత్మ తన్ను తెలుసుకోవట మేమిటి. ఆత్మ నా ఆత్మాన మంటే తెలుసుకొనేది ఆత్మే తెలియబడేది ఆత్మేనని గదా అర్ధం. తెలుసుకొనే దైతే తెలియబడేదెలా అవుతుంది. తెలియబడ
Page 309