#


Index

విభూతి యోగము భగవద్గీత

అందుకే పరమమైన బ్రహమ్మంటున్నాడు. వాటిని కూడా మించిన బ్రహ్మం పరమాత్మ. అలాగే ధామమంటే ప్రకాశమనీ స్థానమనీ అర్థమే. పరంధామ. వాటికి కూడా అతీతమైన ప్రకాశం. అతీతమైన స్థానం పరమాత్మ. అలాగే పవిత్రమైన పదార్ధాలు చాలా ఉన్నాయి లోకంలో. జలం పవిత్రమే. అగ్ని పవిత్రమే. మంత్రం పవిత్రమే. పరమాత్మ వాటికన్నా అతీతమట. అంటే పరమ పావనం. ఇదీ అర్జునుడి పొగడ్త. ఇలా పరమాత్మను కీర్తిస్తున్నాడంటే ఆ తత్త్వాన్ని తన స్వరూపంగా చూడటం లేదనే గదా అర్థం. స్వరూపంగా చూడాలంటే ఎంతో ధైర్యముండాలి. అది జ్ఞానికే ఉంటుంది గాని భక్తుడి కుండదు. భక్తుడు పరమాత్మను తనకు అన్యంగా ఆరాధ్య దైవంగా భావిస్తాడే గాని తన స్వరూపమే ననే అభేద దృష్టితో దర్శించ లేడు. కనుక వీడు మందాధికారి గాకున్నా మధ్యమాధికారి. ఉత్తమాధికారి మాత్రం కాడు.

  పోతే తానే గాక తన స్థాయిలో ఉన్న మహర్షులు కూడా ఆ పరమాత్మను గురించి ఏమని వర్ణిస్తున్నారో జాబితా ఇస్తున్నాడు. పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవం అజం విభుం - పరమాత్మ అంటే పూర్ణ పురుషుడని జీవులలాగా అస్తమించకుండా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవాడని – వీరిలాగా మర్త్య స్వభావం లేని దివ్య స్వరూపుడని దేవతలకు కూడా ఆద్యుడని అసలు జన్మే లేనివాడని - సర్వవ్యాపకుడని చెబుతున్నా రంటాడు. ఆహుః చెబుతున్నారు. ఎవరా చెబుతున్నది ఋషయ స్సర్వే మహర్షులందరూ నట. ఎవరా మహర్షులు. దేవర్షి ర్నారదః - దేవర్షి అయిన నారదుడొకడు. అంతేకాదు. అసితో దేవలో వ్యాసః - అసితుడూ

Page 307

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు