విభూతి యోగము
భగవద్గీత
మరలా మనమర్ధం చేసుకోవలసింది. అది యోగులు చేసే ప్రయత్నం. మరి జ్ఞానుల ప్రయత్నమది కాదు. ఆ వచ్చే భావాలన్నీ నా జ్ఞానంలో నుంచే వస్తున్న విశేషాలు. మరలా ఆ భావాలు కూడా పోయేది ఎక్కడికో గాదు. నాలోకే లయమయి పోతున్న విశేషాలే సుమా. అవి వస్తున్నా పోతున్నా క్రియ వాటిలో జరుగుతున్నదే గాని నా జ్ఞానంలో గాదు. అప్పుడూ ఇప్పుడూ నాపాటికి నేనే ఉన్నాను జ్ఞాన స్వరూపంగా అని అనుసంధానం చేసుకొంటూ పోవటమే ఆత్మ జ్ఞాన సాధన. ఇది ఎలాటిదంటే తరంగాలు వస్తున్నదీ సముద్రంలో నుంచే పోతున్నదీ సముద్రంలోకే. సముద్రం తాను సముద్రంగానే ఉన్నానుకొంటే ఎలా ఉంటుంది. జ్ఞాన సముద్ర సాధన కూడా ఇలాగే జరగాలి.
అయితే నిజమైన ఉత్తమాధికారి అయితేనే అర్థం చేసుకోగలడు. అనుభవానికి తెచ్చుకోగలడు. మరి అందరూ అలాటి ఉత్తమాధికారులు కారు గదా. అర్జునుడి లాంటి మధ్యమాధికారి కిందులో దాగి ఉన్న సూక్ష్మం తెలియక పోవచ్చు. కనుకనే పరమాత్మ తన ఆత్మ స్వరూపమే అని తెలియక ఆమాయికంగా మాటాడుతున్నాడు. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్. బ్రహ్మమూ నీవే ధామమూ నీవే - పవిత్రమూ నీవే నంటాడు. అయితే బ్రహ్మములూ- ధామములూ - పవిత్రాలూ చాలా ఉన్నాయి గదా. బ్రహ్మమంటే పెద్దదని అర్థం. ఆకాశమూ పెద్దదే ఆమాటకు వస్తే. సర్వవ్యాపకమది. వేదానికీ తమస్సుకూ కూడా బ్రహ్మమనే సంజ్ఞ.
Page 306