#


Index

విభూతి యోగము భగవద్గీత

పెట్టుకొన్నది గాదు. ఎటు వచ్చీ దానిమీద వచ్చి పడే ఆలోచనలూ భావాలే ఎప్పటికప్పుడు వచ్చిపోతున్నాయి. అవి నీకు సోకుతున్నప్పుడెలా నాకు సోకుతున్నాయని చూస్తున్నావో తొలగిపోతున్నా నానుంచే తొలగి పోతున్నాయని గదా చూస్తున్నావు. అలాంటప్పుడు నేననే జ్ఞానం నీకు లేకుండా పోవటమేమిటి. ఎప్పుడు నీకు లేకుండా పోయింది. ప్రతిక్షణమూ నేననే స్ఫురణ నీకుంటూనే ఉంది. కాబట్టి ఆ కొమ్మనిక పట్టుకొనే ప్రయత్నం నీకక్కర లేదు. నేననే కొమ్మను నీవు పట్టుకొనే ఉన్నావు ప్రతిక్షణమూ. కాగా దాని బలంతోనే నీవీ అనాత్మ భావాలనే కొమ్మను వదిలేస్తూ పోవాలి. ప్రతి అనాత్మ వృత్తీ పోతుంటే దాని స్థానంలో నేననే భావమే పరిశుద్ధంగా నీకు స్వానుభవానికి వస్తూనే ఉంటుంది. అది ఎలా రావాలా అనే ప్రయత్నమే మాత్రమూ అక్కర లేదు. ప్రయత్నం చేశావంటే మళ్లీ ఆ నేను నాదిగా నీకు మారి కనిపిస్తుంది. మళ్లీ దాన్ని నేననే జ్ఞానబలంతోనే పోగొట్టు కోవలసి వస్తుంది.

  ఇక్కడ ఇంకా ఒక సూక్ష్మముంది. నేననే జ్ఞానం నీకు సిద్ధమని గదా చెప్పాము. పోతే నాకు గోచరించే సమస్త భావాలూ ఇక అసిద్ధమే. ఆగమాపాయులే. అంటే వస్తూ పోయేవే. వాటి రాకపోకల వల్లనే నీ నేను నీకు పరిశుద్ధంగా పరిపూర్ణంగా దర్శనమివ్వటం లేదు. అది ఎప్పుడు దర్శన మిస్తుంది. వీటి రాకపోకలు లేకుండా చేసుకొంటే నని గదా చెప్పాం. ఆ చేసుకోటం వాటిని దూరంగా ఎక్కడికో త్రోసి వేయటమని గాదు

Page 305

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు