#


Index

విభూతి యోగము భగవద్గీత సర్వస్వం

ఏదీ పనికిరాదక్కడ. ఎందుకంటే అనులోమంగా చూస్తే ఇదీ ఆత్మ అని చూడవలసి ఉంటుంది. అంటే మనస్సుతో అలా భావించవలసి వస్తుంది. అలా జరిగిందో అప్పుడది ఆత్మ గాదు. అనాత్మ అవుతుంది. ఎందుకంటే జ్ఞానానికి విషయమయింది జ్ఞానం కాదు. జ్ఞానమే అయితే విషయంగా Object to knowledge కనపడ గూడదు. అంచేత స్వరూపమన్నప్పుడు విషయంగా పట్టుకోరాదు. అలాటి ప్రయత్నమే పనికిరాదు. మరేమిటంటారు. స్వరూపాని కడ్డుతగిలే అనాత్మ భావాలన్నీ త్రోసి వేయాలి. అది అనులోమం కాదా ప్రయత్నం. ప్రతిలోమం. ప్రతిలోమంగా అన్నీ త్రోసి పారేస్తే ఇక మిగిలిపోయేది సచ్చిద్రూపమైన నా ఆత్మ చైతన్యమే కాబట్టి తప్పకుండా అనుభవానికి వస్తుంది.

  కాని ఒక ఆశంక వస్తుంది ఇక్కడ. ప్రతిలోమంగా మిగతా అనాత్మ ప్రపంచమంతా త్రోసి వేయాలంటే అనులోమంగా అసలాత్మ అంటే ఏమిటో దాని జ్ఞానం సంపాదించి దాని బలంతో గదా దీన్ని త్రోసి వేయగలం. అది లేకుండానే ఇది ఎలా త్రోపు పడుతుంది. ఆ కొమ్మ పట్టుకొని గదా ఈ కొమ్మ వదిలేయ గలమని ప్రశ్న.

  దీనికి సమాధాన మేమంటే అనాత్మ అని ఏదంటున్నావో అదంతా ఆత్మ మీద ఆరోపితమయిందే. నేనిలా ఉన్నానలా ఉన్నా నిది నాది అది నాది అని నీతో ముడిపెట్టుకొనే గదా చూస్తున్నావు. భావిస్తున్నావు ప్రతి ఒక్కటీ. ఇందులో నేను అనే స్ఫురణ నీకు సహజంగానే ఉంది. తెచ్చి

Page 304

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు