నని చూస్తుంటాడు. పోతే నిర్గుణభక్తుడైన జ్ఞానికిక నామరూపాది గుణాలన్నీ కరిగిపోయాయి కాబట్టి తానూ భగవంతుడూ వేరనే తేడా తొలగిపోయి అంతా ఆత్మ స్వరూపంగా దర్శనమిస్తుంది. అప్పుడీ సృష్టి అంతా భగవద్విభూతి అనేగాక తన విభూతేననే అనుభూతి కలుగుతుంది.
తేషా మే వాను కం పార్థ మహ మజ్ఞాన జం తమః
నాశయా మ్యాత్మ భావ స్థ జ్ఞాన దీపేన భాస్వతా - 11
అది కూడా అంతకు ముందు లేనిదేదో క్రొత్తగా కలుగుతుందని మరలా భ్రాంతి పడరాదు. లేనిది రాదు ఉన్నది పోదని అద్వైతుల సిద్ధాంతం. అంచేత మొదటినుంచీ మనం పరమాత్మ స్వరూపులమే. క్రొత్తగా అందుకోవలసిందిగాదది. క్రియారూపమైన సాధన ఏదీ లేదు. అయితే మరేమిటి. అంతకు ముందది నేను కాదనే భ్రమలో ఉండి దాన్ని మరచిపోయాము. వస్తుసిద్ధంగా ఉన్నా అది మనకు బుద్ధి సిద్ధం కాలేదు. దానికి కారణం అజ్ఞాన జం తమః అజ్ఞాన జం అవివేకతః జాతం మిధ్యా ప్రత్యయ లక్షణం మోహాంధకారం తమః అని అర్ధం వ్రాశారు భగవత్పాదులు. అజ్ఞానమంటే అవివేక మన్నారాయన. ఏది అసలు స్వరూపమో ఏది దాని ఆభాసో విభజించి చూడలేకపోవటం. దానివల్ల ఏర్పడిందే మిధ్యా ప్రత్యయం. అంటే లేనిదాని నున్నట్టు భావించటం. అదే తమః ఒక చీకటి. రజ్జు సర్పం లాంటిదది. సర్ప మక్కడ లేదు. అయినా ఉందని భావిస్తున్నాము. చీకటిగాక మరేమిటది. వెలుగు లేకపోవటమే చీకటి. రజ్జువనే జ్ఞానం లేకపోవటమే సర్పం. చీకటే అది.
Page 302