#


Index

విభూతి యోగము భగవద్గీత సర్వస్వం

పూర్వకం. ఎంతో ప్రీతితో ఆసక్తితో. కనుక దదామి బుద్ధి యోగం. వారికి నేను జ్ఞానయోగాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. జ్ఞానమనేది ఒకరివ్వట మేమిటి. ఎవడికి వా డల వరుచుకో వలసింది గదా. నిజమే. నిర్గుణ భక్తుడైతే అలవరుచుకోగలడు. ఇది సగుణ భక్తుడి విషయం. వాడికీ భగవద్విభూతే కనిపిస్తున్నది దాని దీని కధిష్ఠానమైన భగవత్స్వరూపం మనసుకు రావటం లేదు. తనకు భిన్నంగా చూస్తున్నాడు. అభిన్నంగా చూడటం లేదు. అభిన్నంగా చూచే స్ఫురణ వాడికి కలిగేలా చేయటమే దదామి అనే మాట కర్ధం. ఈశ్వర స్సర్వభూతానా మాని అందరి హృదయాలలో అంతర్లీనంగా ఉన్నదా సమష్టి చైతన్యమే గదా. దానిమీద దృష్టి పడటమే ఈశ్వరుడు వారికా బుద్ధి కలిగిస్తాడని మరోవిధంగా చెబుతున్నది భగవద్గీత. మొత్తాని కలాంటి ఆత్మజ్ఞానం కలిగితే చాలు. యేన మా ముపయాంతి తే. సగుణ భక్తులు నిర్గుణ భక్తులుగా అంటే జ్ఞానులుగా మారిపోతారు. అప్పుడిక వారికి భగవంతుడు వేరుగా భగవద్విభూతి వేరుగా కనిపించదు. అనిపించదు. సమ్యగ్దర్శనమైన జ్ఞానమది. అది ఎలాంటిదో భగవత్పాదులు వర్ణిస్తున్నారు. వినండి. పరమేశ్వర మాత్మ భూత మాత్మత్వేన ఉపయాంతి ప్రతిపద్యంతే. పరమాత్మ అనేవాడెక్కడో ఉన్నాడని చూడరప్పుడు. తమ ఆత్మ స్వరూపమేనని దర్శిస్తారు. ఆత్మగానే భావిస్తారు భజిస్తాడు. అంటే సగుణ భక్తి వరకూ గుణాలనేవి అడ్డు తగులుతుంటాయి. కాబట్టి భక్తుడికి తాను వేరు తాను భజించే పరమాత్మ వేరు. మహా అయితే ఆయన విలాసమే గదా ఈ సృష్టి అంతా

Page 301

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు